HHVM Record: సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఎన్నో సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పటికీ తదుపరి వేసవి మొత్తం ఖాళీగానే ఉంది. అయితే ఇప్పుడు తిరిగి స్టార్ హీరోలు అందరూ కూడా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, ప్రభాస్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు ఇతర భాష స్టార్ హీరోలు కూడా తమ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ప్రభాస్ ను వెనక్కు నెట్టిన పవన్…
ఇలా స్టార్ హీరోల అందరి సినిమాలు వరుసగా విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు ఎక్కువగా ఏ హీరో సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అనే విషయాన్ని బుక్ మై షో (Book My Show)వెల్లడించింది. బుక్ మై షో ప్రకారం పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్(Prabhas), ఎన్టీఆర్ (Ntr)వంటి హీరోల సినిమాలు కాదని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu)సినిమా చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ ప్రభాస్ దిరాజా సాబ్(The Raja Saab), ఎన్టీఆర్ వార్ 2 (War 2) సినిమాలను వెనక్కి నెట్టి ముందు స్థానంలో ఉంది. బుక్ మై షో ప్రకారం పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు – 268.6K మంది చూడటానికి ఆసక్తి కనబడుతున్నట్లు తెలుస్తోంది.
మొదటి పాన్ ఇండియా చిత్రం..
ఇక ఈ సినిమా తర్వాత వరుసగా, War2 – 165.6K, సయ్యారా – 148.6K, ది రాజా సాబ్ – 142.8K, OG – 130.2K ,కాంతారా చాప్టర్1 – 117.3K, టాక్సిక్ – 116.9K, కూలీ – 92.2K, జూనియర్ – 85.9K
పెద్ది – 54.6K,NTR31 – 42.5K, కింగ్‌డమ్ – 42.5K సినిమాలను చూడటానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు నటించిన ఏ ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రం భారీ క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి.
అంచనాలను పెంచిన ట్రైలర్..
ఇక పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈనెల 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ జ్యోతి కృష దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి విడుదల చేసిన అప్డేట్స్ ఇప్పటికే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తో సినిమా లెక్కలు మారిపోయాయి. ఈ సినిమానికి మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తి నెలకొంది.
Also Read: Nayanthara Divorce : విఘ్నేష్‌తో విడాకులు… ఫస్ట్ టైం రియాక్ట్ అయిన నయన్