Nayanatara Divorce: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార(Nayanatara) దర్శకుడు విగ్నేష్ శివన్(Vignesh Shivan) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు కవల మగ పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ జంట తన పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఇటీవలన నయనతార విగ్నేష్ దంపతులు విడాకులు (Divorce) తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తల పట్ల ఇప్పటివరకు నయనతార ఎక్కడ స్పందించకపోయిన మొదటిసారి విడాకుల వార్తలపై స్పందించారు. ఈ క్రమంలోనే తన భర్త విఘ్నేష్ తో కలిసి దిగిన ఫోటోని ఈమె షేర్ చేస్తూ..” మా గురించి ఏదైనా సిల్లీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే” అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఒక ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది .
తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు..
ఇలా నయనతార ఈ విడాకుల వార్తలపై స్పందించి క్లారిటీ ఇవ్వడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నయనతార సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.“తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరంలేదు. ” అంటూ నయన్ పేరుతో ఓ ఇన్ స్టా స్టోరీ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఈ పోస్ట్ చేసిన కాసేపటికే డిలీట్ చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన డామేజ్ మొత్తం జరిగిపోయింది.
మురుగన్ ఆలయం…
ఇలా నయనతారకు తన భర్త విగ్నేష్ కు బేధాభిప్రాయాలు వచ్చాయని అందుకే ఈమె ఇలాంటి పోస్ట్ చేసింది అంటూ ఎంతో మంది ఎన్నో విధాలుగా ఊహించుకొని వీరి విడాకులు వార్తలను తెగ వైరల్ చేశారు. ఇలా వీరిద్దరి గురించి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఈ జంట తమ పిల్లలతో కలిసి మురుగన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేకంగా పూజలు కూడా చేయించారు. అయితే ఈమె అధికారికంగా విడాకుల వార్తలను ఖండిస్తూ తాజాగా పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు పులిస్టాప్ పడింది.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ..
ఇక నయనతార కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమాల్లో కూడా నయనతార భాగమైన విషయం తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపున నయనతార విగ్నేష్ నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విగ్నేష్ డైరెక్షన్ లో నయనతార నిర్మాణంలో “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” అనే సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా కెరియర్ పరంగా ఈ జంట ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. నయనతార ఎంతో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా వేదికగా నిత్యం తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.