HHVM Storyline Leaked: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) త్వరలోనే హరిహర వీరమల్లు(Harihara Veeramallu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జ్యోతి కృష్ణ (Jyothi Krishna)దర్శకత్వంలో ఏ.యం. రత్నం(A.M. Ratnam) నిర్మాణంలో ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా జూన్ 12వ తేదీ విడుదల కావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో ఈ సినిమా మరోసారి వాయిదా పడుతూ జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు.
సనాతన ధర్మ రక్షకుడిగా..
ఇకపోతే నిర్మాత రత్నం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తున్నారు. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమా స్టోరీ మొత్తం లీక్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక అనాథగా (Orphan) కనిపించబోతున్నారంటూ రత్నం చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర గురించి చెబుతూ.. “తీవ్రమైన వరదలలో కొట్టుకు వచ్చిన చిన్నారే ఈ పవన్ కళ్యాణ్ అని తెలిపారు అయితే ఆయనకు తల్లిదండ్రులు ఉండరని, అనాధలాగా ఒక ఆలయంలో పెరిగి పెద్దవుతారని” తెలిపారు.
పవన్ వ్యక్తిగత జీవితానికి..
చిన్నప్పటినుంచి ఆలయంలో పెరగటం వల్ల పెద్దయిన తర్వాత సనాతన ధర్మ రక్షకుడిగా మారుతారని రత్నం తెలిపారు. ఔరంగజేబు సనాతన ధర్మానికి నష్టం కలగజేసే సమయంలో వీరమల్లు ఎలా సనాతన ధర్మాన్ని కాపాడారనే నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఆ పరమశివుడు విష్ణువు మిశ్రమంగా వీరమల్లు పాత్ర ఉండబోతుందని తెలిపారు. ఇది దైవిక బలం, ధర్మాన్ని కూడా చూచిస్తుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించిన పాత్ర ఆయన వ్యక్తిగత జీవితానికి కూడా సరిగ్గా సూట్ అవుతుందని రత్నం తెలిపారు. వ్యక్తిగత జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ యోధుడిగా సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు.
ఇది కల్పిత పాత్ర మాత్రమే…
ఇక ఈ సినిమాలో వీరమల్లు పాత్ర అనేది పూర్తిగా ఒక కల్పిత పాత్ర తప్ప ఎవరిని ఆధారంగా చేసుకొని రూపొందించింది కాదని ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కొంతమంది బీసీ సంఘానికి చెందిన వ్యక్తులు వీరమల్లు సినిమాని అడ్డుకుంటాము అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను తెలంగాణ పోరాటయోధుడు పండుగ సాయన్న(Panduga Sayanna) జీవిత చరిత్రను కల్పిత కథగా మార్చేసి ఇష్టానుసారంగా సినిమా చేశారని, ఇది సాయన్నను అవమాన పరిచినట్టేనని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సినిమా విడుదలను కూడా అడ్డుకుంటామంటూ ప్రకటన కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రత్నం.. వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పూర్తిగా కల్పితమేనని ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు అంటూ నొక్కి చెప్పారు.
Also Read: HHVM Record: వార్ 2, రాజా సాబ్‌ను క్రాస్ చేసిన వీరమల్లు… పవన్ దెబ్బ మామూలుగా లేదు మరి