Actor Kalabhavan Navas Died: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముక నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్(51) మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం హోటల్ గదిలో ఆయన శవమై కనిపించారు. దీంతో ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మలయాళంలో నటుడిగా మంచి గుర్తింపు పొందిన కళాభవన్ నవాస్.. శుక్రవారం సాయంత్రం కేరళలోని చోట్టనిక్కరలో ఉన్న ఓ హోటల్ గదిలో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను హోటల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
షూటింగ్ కోసం వెళ్లి..
ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. గుండెపోటుతో ఆయన మరణించిన ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ, ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షూటింగ్ లో భాగంగా కళాభవన్ అక్కడ హోటల్ లో బసచేస్తున్నారు. షూటింగ్ అయిపోయి శుక్రవారం ఆయన హోటల్ గది చెక్ అవుట్ చేయాల్సి ఉంది. కానీ, ఆయన ఎంతవరకు బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది ఆయన గదికి వెళ్లారు. ఆయన ఎంతసేపటికి డోరు తెరవకపోవడంతో మరో కీతో తలుపులు తెరిచి చూడగా.. ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
హోటల్ గదిలో మృతి
వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకుని హోటల్ గదిని పరీక్షించారు. గదిలో అనుస్పదంగా ఏమి కనిపించకపోవడంతో గుండెపోటుతో మరణించి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఈ నిమిత్తం శనివారం ఆయనకు కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
సినీ నేపథ్యం..
కాగా కళాభవన్ నవాస్ తొలుత మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత నటుడిగ, సింగర్ గా కూడా మలయాళ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. 1995లో చైతన్యం అనే సినిమాతో ఆయన వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఆయన హాస్య నటుడిగా తనదైన నటనతో ప్రేక్షకులును ఆకట్టుకున్నారు. అలా మిమిక్స్ యాక్షన్ 500 (1995), హిట్లర్ బ్రదర్స్ (1997), జూనియర్ మాండ్రేక్ (1997), మట్టుపెట్టి మచాన్, అమ్మ అమ్మయ్యమ్మ (1998), చందమామ (1999), థిల్లానా తిల్లానా (2003) వంటి చిత్రాలతో కమెడియన్ గా నటించి మెప్పించారు.
అంతేకాదు పలు కామెడీ షోలకు కూడా ఆయన జడ్జీగా వ్యవహరించారు. అంతేకాదు పలు చిత్రాల్లోనూ పాటలు పాడి అలరించారు. ఇండస్ట్రీలో నటుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, కమెడియన్, సింగర్ గా ఎంతో కీర్తి గడించిన ఆయన ఆకస్మాత్తుగా మరణించడం.. మలయాళ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన మృతిపై ఇండస్ట్రీ ప్రముఖులు సహా నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కళాభవన్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.