Nagarjuna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవ మన్మధుడిగా పేరు సొంతం చేసుకున్నారు నాగార్జున (Nagarjuna). తన అద్భుతమైన నటనతో , మాస్ పెర్ఫార్మెన్స్ తో కూడా ప్రేక్షకులను అలరించిన ఈయన.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. వరుస క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇదిలా ఉండగా తాజాగా నాగార్జున అభిమానుల కోసం దిగి వచ్చారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
జపాన్ లో రీ రిలీజ్ కి సిద్ధమైన మనం..
ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ చిత్రాల హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అభిమాన హీరోలకు సంబంధించిన ఏదైనా స్పెషల్ అకేషన్ రోజున.. వారి కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తుంటారు . దీనికి తోడు అటు జపాన్ లో కూడా తెలుగు చిత్రాలకు విపరీతంగా క్రేజ్ పెరిగింది. మన హీరోలకి కూడా అక్కడ డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారనటంలో సందేహం లేదు. ఇప్పటికే ‘ముత్తు’ సినిమాతో రజనీకాంత్(Rajinikanth) కు భారీ పాపులారిటీ లభిస్తే.. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లకి కూడా భారీ క్రేజ్ లభించింది. ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ (Prabhash ) కూడా అక్కడివారికి ఇష్టమైన హీరోగా మారిపోయారు. వీరే కాకుండా నాగార్జునకి కూడా అక్కడ భారీ క్రేజ్ ఉంది అని చెప్పవచ్చు. బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున యాక్టింగ్ కి ఫిదా అయిన అక్కడి సినీ ప్రియులు.. ఆయనకు డైహార్డ్ ఫ్యాన్స్ గా మారిపోయారు..
అభిమానులతో ముచ్చటించడానికి సిద్ధమైన నాగార్జున..
అయితే ఆ క్రేజ్ ను ఇప్పుడు క్యాష్ చేసుకోవడం కోసం నాగార్జున సిద్ధమయ్యారు. టాలీవుడ్ ఎవర్గ్రీన్ హిట్ మూవీగా నిలిచిన ‘మనం’ సినిమాను ఆగస్టు 8న రీ రిలీజ్ చేయడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు రీ రిలీజ్ కోసం జపాన్ అభిమానులతో కూడా ముచ్చటించనున్నారు. ముఖ్యంగా తనపై ఇంత ప్రేమ, ఆదరణ చూపిస్తున్న అభిమానులతో నాగార్జున సమావేశం కానున్నారు. అయితే నేరుగా అభిమానులను కలవకుండా సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులతో నాగార్జున వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ విషయం తెలిసి జపాన్ అభిమానులు కూడా తమ అభిమాన హీరో నాగార్జునతో మాట్లాడడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది ఒక మరిచిపోలేని అనుభూతి అని చెప్పవచ్చు.
మనం సినిమా విశేషాలు..
ఇక మనం సినిమా విషయానికి వస్తే.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దివంగత లెజెండ్రీ నటులు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao), ఆయన వారసుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఆయన వారసులు అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), అక్కినేని అఖిల్(Akkineni Akhil) కలయికలో వచ్చిన చిత్రం మనం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని కుటుంబం నిర్మించిన ఈ సినిమా 2014లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సమంత, తేజస్వి మదివాడ, శ్రీయా శరణ్ కీలక పాత్రలు పోషించారు.. ఇక అక్కినేని కుటుంబానికే కాదు యావత్ సినీ ఇండస్ట్రీలో ఒక ఎవర్గ్రీన్ మూవీ గా నిలిచింది ఈ సినిమా.
ALSO READ:Hero Sumanth: ఆ ఒక్క కారణంతో హిందీలో ఐదు సినిమాలు కోల్పోయా – హీరో సుమంత్