National Awards 2025: చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాల్లో జాతీయ అవార్డు ఒకటి. తమ సినీ జీవిత కాలంలో ఒక్కసారైనా నేషనల్ అవార్డు అందుకోవాలని కలలు కంటారు. తెరపై వారి అద్భుతమైన నటనను కూడా నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ కొనియాడుతున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 2025 ఏడాదికి గాన 71వ జాతీయ అవార్డు పురస్కారాలను ప్రకటించింది. మన భారత చలన చిత్రరంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డు ప్రతిఒక్కరిలో ఆసక్తిని కనబరుస్తున్నాయి.
షారుక్ కి అవార్డు ఎందుకు?
ఎన్నో క్యాటగిరిలో వివిధ భాష చిత్రాలు ఈ అవార్డుకు ఎన్నికయ్యాయి. వీటిలో అందరి చూపు మొదట ఉత్తమ నటుడి క్యాటగిరిపై పడుతుంది. ఏ నటుడికి వచ్చింది, నిజంగా ఈ అవార్డుకు అతడు అర్హుడేనా అని లెక్కలు వేసుకుంటారు. అయితే 2023 విడుదలైన చిత్రాలో వచ్చిన జవాన్ మూవీకి గానూ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ను ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపిక చేశారు. అయితే దీనిపై సర్వత్రా వ్యతిరేకత వస్తుంది. జవాన్ చిత్రానికి షారుక్ కు నేషనల్ ఇవ్వాల్సినంత పర్ఫామెన్స్ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఆయన గొప్ప నటుడే.. జాతీయ అవార్డు ఇవ్వాల్సిన పాత్రలు ఎన్నో చేశారు.
పృథ్వీరాజ్ అర్హుడు..
కానీ, జవాన్ అంతగా ఆయన నటన ఏముందంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయనను మించి బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన పాత్రలు ఇంకేన్నో ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. గతేడాది లో వివిధ భాషల్లో అద్బుతం అనిపించేలా చేసిన లీడ్ పాత్రలు చాలనే ఉన్నాయి. అందులో ముందుగా చెప్పుకునేది మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్. ఆడు జీవితంలో (The Goat Life) పృథ్వీరాజ్ అద్భుతమైన నటన కనబరిచారు. స్టార్ హీరో అనే ఫీలింగ్ ఎక్కడ లేకుండ ఓ అభాగ్యుడి పాత్రను అద్భుతంగా పండించారు.
ఈ సినిమా కోసం ఏకంగా 31 కీలోల బరువు తగ్గారు. ఈ సినిమా కోసం కొన్నేళ్లు కష్టపడ్డారు. మరో పాత్ర చూసుకుంటే తంగలాన్ లో విక్రమ్ రోల్. ఇందులో విక్రమ్ నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇంకా చెప్పుకుంటే ఇంకేన్నో గొప్ప పాత్రలు ఉన్నాయి. కానీ, వాటిని కాదని షారుక్ ఇవ్వడంపై నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. గతంలో నేషనల్ అవార్ట్స్ ప్రకటించిన ప్రతిసారి ఇలాంటి విమర్శలు వస్తూనే ఉన్నాయి. గతంలో పుష్ప1కి అల్లు అర్జున్ అవార్డు గెలిచిన సమయంలోనూ వ్యతిరేకత వచ్చింది. జైభీమ్ లో హీరో సూర్యకు ఇవ్వాల్సింది.. అల్లు అర్జున్ కి ఇచ్చారని, పుష్పలో సమాజానికి ఉపయోగపడేలా ఏముందని ట్రోల్ చేశారు.
ప్రతిసారి ఇదే రిపీట్
గతేడాది కాంతార సినిమాకు గాను నటుడు రిషబ్ శెట్టికి ఇచ్చారు. కానీ అదే టైంలో మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టికి ఇవ్వాలనే అభిప్రాయాలు వచ్చాయి. ‘నన్పకల్ నేరతు మయక్కం’ మూవీలో ఆయన అద్భుతం నటన కనబరిచారని, నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారని, ఆయనకే జాతీయ అవార్డు ఇవ్వాలని డిమాండ్స్ వచ్చాయి. ఇలా గత మూడేళ్లుగా జాతీయ అవార్డ్స్ ప్రకటన ఇచ్చిన ప్రతిసారి వివిధ నటులకు అన్యాయం జరిగింతోందని నెటిజన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి.