BigTV English

Actor Rajesh: లైవ్ ఈవెంట్ లో నటుడికి గుండెపోటు… పరిస్థితి విషమం!

Actor Rajesh: లైవ్ ఈవెంట్ లో నటుడికి గుండెపోటు… పరిస్థితి విషమం!

Actor Rajesh Keshav Health Update: ప్రముఖ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్ రాజేశ్ కేశవ ప్రస్తుతం విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఓ లైవ్ కన్సల్ట్ లో కుప్పకూలిన ఆయనను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఎమర్జేన్సీ చికిత్స అందించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఇండస్ట్రీవర్గాలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.


లైవ్ లో కుప్పకూలిన రాజేష్

కాగా రాజేష్ కేశవ్ మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు. పలు చిత్రాల్లో నటించిన ఆయన టెలివిజన్ ప్రజెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. కేరళకు చెందిన రాజేష్.. ఆదివారం(ఆగష్టు 24) రాత్రి కొచ్చిలోని ఒక పబ్లిక్ ప్రొగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా లైవ్ లో మాట్లాడుతున్న అతడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. దీంతో ఈవెంట్ నిర్వాహకులు, వైద్య సిబ్బంది వెంటనే స్పందించి అతడికి ప్రాథమిక చికిత్స అందించారు.


వెంటి లెటర్ పై చికిత్స

అనంతరం అత్యవసర చికిత్స కోసం సమీపంలో ఆస్పత్రికి తరలిచారు. అక్కడ వైద్యులు రాజేష్ ను పరీక్షించి వైద్యులు అతడికి గుండెపోటు వచ్చినట్టు తెలిపారు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టి చేసి.. అత్యవసర చికిత్స అందించారు. ఈ ఘటనలో ఆయన మెడు ప్రభావితమైందని, ప్రస్తుతం రాజేష్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారు. 72 గంటలు పాటు ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచాలని, అప్పటి వరకు ఆయన ఆరోగ్యం గురించి ఏం చెప్పాలమని వైద్యులు పేర్కొన్నారు.

Also Read: Shah Rukh Khan-Deepika Padukone: కోర్టు ఆదేశం.. షారుక్ ఖాన్, దీపికాపై చీటింగ్ కేసు..

నటుడు, టీవీ యాంకర్ గా

దీంతో రాజేష్ కేశవ్ త్వరగా కోలుకోని మలయాళ ఇండస్ట్రీ వర్గాలు, నటీనటులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో రాజేష్ కేశవ్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాజేష్ కేశవ్ కేరళ టీవీ యాంకర్ గా పాపులర్ అయ్యాడు. అతడు ఎన్నో రియాలిటీ షో, టాక్ షోలకు హోస్ట్ వ్యవహరించి ఎంతో ప్రజాదారణ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో సినిమాల్లోనూ సహాయ పాత్రలు పోషించాడు. ఎన్నో చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించి తనదైన నటనతో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. యలయాళంలో నటుడిగా,టీవీ యాంకర్ ఎంతో ఆదరణ పొందిన రాజేష కేశవ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి అతడి అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు.

Related News

Prakash Raj: ప్రధాని మోడీపై సెటైర్లు పేల్చిన ప్రకాష్ రాజ్.. సిగ్గుపడాల్సిన పనిలేదంటూ!

OG Update:పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓజీ నుండి అప్డేట్.. లిమిటెడ్ స్టాక్.. త్వరపడండి!

Peddi Movie: రామ్ చరణ్ పెద్ది నుంచి బిగ్ అప్డేట్… స్పెషల్ వీడియో వదిలిన టీమ్!

Heroine Poorna: ఈ దూరం భరించలేను.. సంచలన పోస్ట్ పెట్టిన పూర్ణ!

Chiranjeevi: స్పిరిట్ సినిమాలో మెగాస్టార్…అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగ మామ!

Big Stories

×