Case on Shah Rukh and Deepika: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనెలపై కేసు నమోదైంది. ఓ ప్రకటన ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై హైకోర్టు వారిపై సీరియస్ అయ్యింది. ఈ మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కాగా రాజస్థాన్ లోని భరత్ పూర్ కు చెందిన కీర్తి సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వివరాలు.. షారుక్, దీపికాలు హ్యూందాయ కంపెనీకి చెందిన కారును ప్రమోట్ చేస్తూ ప్రకటనలో నటించారు. ఈ కారుపై పాజిటివ్ గా రివ్యూ ఇస్తూ దానిని ప్రమోట్ చేశారు.
షారుక్, దీపికాపై కోర్టులో పిటిషన్
వారి ప్రమోషన్ యాడ్ చూసి కీర్తి సింగ్ ఆ కారు కోనుగొలు చేసి తీవ్రంగా నష్టపోయాడట. సుమారు రూ. 24 లక్షలతో హ్యూందాయ్ అల్కాజార్ కారును కీర్తి సింగ్ కోనుగోలు చేశాడట. అయితే కేవలం ఆరు నెలల్లోనే కారు ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయట. అంతేకాదు స్పీడ్ తో వెలుతున్నప్పుడు ఇంజిన్ నుంచి శబ్ధాలు వస్తున్నాయని, ఒక్కోసారి కారు దారి మధ్యలోనే ఆగిపోతుందని తన ఫిర్యాదులో పేర్కొనాడు. కారు సమస్య గురించి కంపెనీ ఏజెన్సీని సంప్రదించక.. వారు కారు మోడల్ లోనే లోపాలు ఉన్నాయని, దానిని పరిష్కరించలేమని షోరూం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
పోలీసులకు కోర్టు ఆదేశం
దీంతో వారి తీరుపై ఆగ్రహంతో కీర్తి సింగ్ పోలీసులను ఆశ్రయించారు. కారు కంపెనీ సిబ్బందితో పాటు షారుక్ ఖాన్, దీపికాలపై కూడా కేసు ఫిర్యాదు చేశారు. అయితే అతడు చెబుతున్నట్టు కారు ఇంజిన్ లో ఎలాంటి లోపాలు లేవని నిపుణులు తెల్చడంతో ఈ కేసు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో కీర్తి సింగ్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. హ్యూందాయ్ కంపెనీ బ్రాండ అంబాసిడర్స్ గా వ్యవహరించిన షారుక్ ఖాన్, దీపికా పదుకొనెలు దీనికి బాధ్యత వహించాలని, వారిపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ భరత్పూర్లోని సీజేఎం కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు షారుక్, దీపికాలోపై సెక్షన్ 420(చీటింగ్) ఇతర సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని మధుర గేట్ పోలీసులను కోర్టు ఆదేశించింది.
Also Read: Toxic: టాక్సిక్ లో యష్ డ్యూయల్ రోల్.. హీరో, విలన్ ఒక్కరే
కోర్టు ఆదేశం మేరకు పోలీసులు వీరిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా 1998 నుంచి షారుక్ హ్యుందాయ్ బ్రాండ్ తో సత్సంబంధాలను కలిగి ఉన్నాడు. 2023 నుంచి దీపికా ఈ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో గతేడాది వీరిద్దరు కలిసి ఓ ప్రకటనలో నటించారు. ఇందులో హ్యుందాయ్ కారును ప్రమోట్ చేస్తూ.. కారు ఫీజర్స్ పై పాజిటివ్ రివ్యూ ఇచ్చి కస్టమర్లను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటన చేశారు. అయితే ఇలాంటి కేసులో గతంలో సుప్రీం కోర్టు ఓ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తప్పుదోవ పట్టించేలా సెలబ్రిటీలు ప్రకటనలు చేస్తే.. దీనికి ఎండార్సర్లు కూడా బాధ్యత వహించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలోనే కంపెనీకి చెందిన ఆరుగురు సిబ్బందితో పాటు షారుక్, దీపికాపై కేసు నమోదైంది.