E-Paper
Advertisement

రాముడిపై జావీద్ అఖ్తర్ సంచలన కామెంట్స్.. రగిలిపోతున్న ముస్లిం సంఘాలు!

రాముడిపై జావీద్ అఖ్తర్ సంచలన కామెంట్స్.. రగిలిపోతున్న ముస్లిం సంఘాలు!
Advertisement

Javed Akhtar: దీవార్ ,జంజీర్,షోలే వంటి ఎన్నో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ మూవీస్ కు కథ మాటలు రాసిన జావీద్ అఖ్తర్ ఇపుడు దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. రాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ముస్లిం సమాజానికి ఆగ్రహం తెప్పించాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న జావీద్ అఖ్తర్ మాట్లాడుతూ రాముడిపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రామాయణ సినిమా మానియాలో దేశం ఊగిపోతోన్న వేళ రాముడు కేవలం ఒక వ్యక్తి కాదని..ఒక జీవన విధానమని జావీద్ అఖ్తర్ కొనియాడారు. ప్రతీ భారతీయుడి రక్తంలోనూ రాముడు ఉంటాడని వ్యాఖ్యానించారు. మనలోని రావణుణ్ని బయటకు పంపిస్తే ఆ మనసులో రాముడు ఉంటాడు అని అర్దం వచ్చేలా వ్యాఖ్యానించారు. రాముడు ఒక మతానికి పరిమితమైన వ్యక్తి కాదని మానవాళికి నైతిక విలువలు నేర్పిన మహనీయుడు అని ప్రశంసించారు జావీద్.

రెండు పడవలపై ప్రయాణించడం కరెక్ట్ కాదు..

Advertisement

జావీద్ అఖ్తర్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాజిద్ రషీదీ జావీద్ పై మండి పడ్డారు. బాలీవుడ్ లో తన పాటలను అమ్ముకోవడం కోసమే జావీద్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మౌలానా ఆరోపించారు. జావీద్ ఒక వ్యాపారి.. ఆయన కుటుంబ సభ్యులు కూడా బాలీవుడ్ లో వివిధ రంగాల్లో ఉన్నారు. వారి వ్యాపారం బాగుండాలంటే వారికి వ్యాపారం ఇచ్చేవారిని పొగడాలి అందుకే జావీద్ ఇలా మాట్లాడారని మౌలానా విమర్శించారు. తాను నాస్తికుణ్నని పదే పదే చెప్పిన జావీద్ అఖ్తర్ కి రాముడిపై విశ్వాసం ఎలా కలిగింది? అని మౌలానా ప్రశ్నించారు. రాముడిపై అంత ప్రేమ ఉంటే జావీద్ అఖ్తర్ వెంటనే తన పేరును రామ్ పాల్ గా మార్చుకోవాలని ఆయన సెటైర్ వేశారు. రెండు పడవలపై ప్రయాణించడం కరెక్ట్ కాదన్నారాయన.

సినీ రంగంలోనే కాదు ఉర్దూ కవిత్వంలోనూ..

Advertisement

బాలీవుడ్ రంగంలో జావీద్ అఖ్తర్ పేరు వినని వారు ఉండరు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ కు కథ మాటలు రాసిన జావీద్ అఖ్తర్ తిరుగులేని పాటల రచయితగానూ పాపులర్ అయ్యారు. సినీ రంగంలోనే కాదు ఉర్దూ కవిత్వంలోనూ జావీద్ కు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కవిత్వంపై ప్రేమతోనే ఆయన ప్రముఖ ఉర్దూకవి కైఫీ అజ్మీ కూతురు షబానా అజ్మీని ప్రేమించి పెళ్లి కూడా.

Also Read: మోదీకి చుక్కలు చూపిస్తోన్న రాహుల్.. విదేశీ గడ్డపై నుంచి మరో డేంజరస్ కామెంట్!

Tags

Related News

హీరోకు లోపముంటే సినిమా సక్సెస్..టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్!

స్కూల్ లో పరిచయం.. ఫేస్ బుక్ లో ప్రేమ.. దుల్కర్ లవ్ స్టోరీ మామూలుగా లేదే?

ENE Repeat రిలీజ్‌కు ముందే హీరోయిన్ ఎమోషనల్.. అసలు ఏమైందంటే?

ఆ ఒక్కపనితో అనుష్క శాశ్వతంగా టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిందా?

చెక్ బౌన్స్ కేసు… బండ్లన్నకు ఏడాది జైలు శిక్ష..భారీ జరిమాన?

రేణూ దేశాయ్ హెయిర్ స్టైలిస్ట్ ను చూశారా..ఎంత క్యూట్ గా ఉందో కదా!

అన్నపూర్ణ స్టూడియోలో ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ గేమ్ చిత్రీకరణ.. పూర్తి వివరాలు ఇవే!

Big Stories

Advertisement
×