E-Paper
Advertisement

క్రీడల విషయంలో.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు చాలెంజ్?

క్రీడల విషయంలో.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు చాలెంజ్?
Advertisement

Sports Development: స్వేచ్చ బ్యూరో: క్రీడల విషయంలో ప్రభుత్వ మాటలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటే, చేతలు గల్లీ స్థాయి దాటకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లో ఒలంపిక్స్ నిర్వహిస్తామంటూ డబ్బా ప్రచారం చేసుకునే ప్రభుత్వం.. క్రీడాకారుల సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా బుధవారం ప్రభుత్వంపై పైర్ అయ్యారు. అన్ని వర్గాల ప్రజలను మోసి చేసినట్లే.. క్రీడాకారులను కూడా దగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారుల సమస్యలు వింటుంటే ఆవేదన కలుగుతున్నదన్నారు. ఫుట్ బాల్ సరదాలు తీర్చుకోవడం కోసం సీఎం వంద కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడమే తప్ప, క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు సున్నా అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రభుత్వ ప్రోత్సాహం లేక క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. ఖేలో ఇండియా క్రీడలకు ప్రధానిని ఆహ్వానిస్తున్న ప్రభుత్వం.. క్రీడాకారులకు కోచ్ లను నియమించాలన్న కనీస సోయి కూడా లేదా? అని నిలదీశారు.

ఎవరు మార్గనిర్దేశం చేస్తారు?

విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన కూడా మీకు లేదా? పీఈటీలు లేకుండా, పీడీలు లేకుండా మీరు ఏర్పాటు చేస్తానంటున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం ఎలా నెరవేరుతుంది?కోచ్ లు లేకుండా క్రీడా కారులకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారు?ఖేల్ ఇండియా క్రీడా పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలంటే ముందుగా కోచ్ లను నియమించండి అని సూచించారు.గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించేందుకు గాను పీఈటీ, పీడీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయండి అన్నారు. మాటలు కాదు, చేతలు చూపించి తెలంగాణ క్రీడాకారుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోండి..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు టీఏ, డీఏ ప్రయాణ, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు.

Advertisement

Also read: రూ.50 పెట్టుబడితో ఈ స్థాయిలో ఉన్నా.. అలీ సక్సెస్ సీక్రెట్ అదేనా?

ఎంపిక విధానం..

క్రీడా బడ్జెట్‌ను పెంచి, కేటాయించిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. మెగా డీఎస్సీ అని నిరుద్యోగ యువతను దగా చేశారు, వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించాలన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేసి, ఆధునిక శిక్షణ కేంద్రాలు, మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్నారు. క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా సమాన అవకాశాలు, పారదర్శకమైన ఎంపిక విధానం కల్పించాలన్నారు. క్రీడారంగ అభివృద్ధి అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రకటనలు, మైకుల ముందు ప్రగల్భాలు కాదు.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. క్రీడాకారుల భవిష్యత్తుతో చలగాటం ఆడటం మానేసి, హక్కులను కాపాడి, వారి ఆశయ సాధనకు తోడ్పాటు అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

వినతి పత్రం..

Advertisement

ఉస్మానియా యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ బృందం బుధవారం కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో భేటీ అయ్యారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వినతి పత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని హరీష్ రావును కోరగా సానుకూలంగా స్పందించి విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు.

Also Read: నగరాన్ని వణికించే హంతకుడు… పోలీసులకు నిద్రలేని రాత్రులు… వెన్నులో వణుకు పుట్టించే సిరీస్

Tags

Related News

ఇకపై సభలు, ఫంక్షన్ల నిర్వహణపై.. మున్సిపల్ కార్పొరేషన్ కొత్త రూల్స్?

కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్.. బీఆర్ఎస్‌కు సవాల్!

తెలంగాణకు అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు!

‘షీ టీమ్స్’ పేరుతో నకిలీ నోటీసు.. మాజీ ప్రియుడిపై యువతి రివేంజ్.. పోలీసులు సైతం షాక్!

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీతో సీఎం రేవంత్ భేటీ.. ఆ అంశాలపై చర్చ!

సాగర్ జలాల దోపిడీపై మౌనమెందుకు? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? కాంగ్రెస్‌పై కవిత ఫైర్!

పనిచేయడం చేతకాక బీజేపీపై విమర్శలా? కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై రాంచందర్ రావు ఫైర్

Big Stories

Advertisement
×