E-Paper
Advertisement

వామ్మో ‘బాయ్స్’ టైటిల్ కార్డులో ఇంత అర్థం ఉందా? ఇన్నేళ్లకు బయటపడిందా?

వామ్మో ‘బాయ్స్’ టైటిల్ కార్డులో ఇంత అర్థం ఉందా? ఇన్నేళ్లకు బయటపడిందా?
Advertisement

Boys Title Card: ఏ సినిమా ఎప్పుడు ఏ విధంగా ట్రెండింగ్ లో ఉంటుందో ఎవరు ఊహించలేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శంకర్ డైరెక్షన్లో 23 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాయ్స్ సినిమా(Boys Movie) టైటిల్ కార్డు వైరల్ అవుతుంది. ఇలా 23 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్ అవ్వడం ఏంటి అసలేం జరిగిందనే విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో సిద్ధార్థ హీరోగా నటించిన బాయ్స్ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ కార్డ్ చర్చలకు కారణమైంది.

అమ్మాయి నడుము ఒంపు పై టైటిల్..

ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో భాగంగా బాయ్స్ అనే ఇంగ్లీష్ అక్షరాలు ఒక తీగ మీద ఉన్నట్టు మనకు కనబడుతుంటాయి. అయితే అది తీగ కాదని అమ్మాయి నడుము అంటూ ఇన్ని సంవత్సరాలకు ప్రేక్షకులు గుర్తించడంతో ఈ టైటిల్ కార్డు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ కార్డులో BOYS అనే అక్షరాలు ఎగురుతూ కనిపిస్తుంటాయి. అప్పట్లో ఈ యానిమేషన్ చూసిన ప్రేక్షకులు ఇది సాధారణమే అనుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం దీనిని డీ కోడ్ చేసి చూస్తే మాత్రం షాకింగ్ విషయం బయటపడింది. కొంతమంది సినీ ప్రేమికులు, నేటిజన్స్ ఈ సినిమా టైటిల్ డీకోడ్ చేస్తూ.. మొబైల్ స్క్రీన్ లేదా లాప్టాప్ స్క్రీన్ ఎడమవైపు తిప్పి చూస్తే బాయ్స్ అనే అక్షరాలు తీగ మీద కాకుండా అమ్మాయి నడుము ఒంపులో ఎగురుతూ ఉన్నట్టు కనిపిస్తుంది .

తీగ కాదు.. నడుము ఒంపు..

Advertisement

సాధారణంగా ఈ టైటిల్ తీగపై ఉన్నట్టు కనిపిస్తుంది కానీ దీనిని మరొక కోణంలో చూస్తే అమ్మాయి నడుము ఒంపుపై ఉన్నట్టు కనిపించడమే ఈ టైటిల్ కార్డు ప్రత్యేకత అని చెప్పాలి. అప్పట్లోనే శంకర్ చాలా అద్భుతంగా ఆలోచించి ఈ సినిమా టైటిల్ డిజైన్ చేశారు. కానీ ఈ విషయం ఇన్ని సంవత్సరాలకు బయటపడటంతో ఫ్యాన్స్,నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Advertisement

ఇక బాయ్స్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో సిద్ధార్థ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కూడా నటించిన సంగతి తెలిసిందే. వివేక్, నకుల్, భరత్ వంటి తదితరులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించారు. ఈ సినిమా అప్పట్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక ఈ సినిమా సంగీతం మాత్రం ఇప్పటికే ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2023లో విడుదల కాగా ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

Also Read: హీరోకు లోపముంటే సినిమా సక్సెస్..టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్!

Related News

రాముడిపై జావీద్ అఖ్తర్ సంచలన కామెంట్స్.. రగిలిపోతున్న ముస్లిం సంఘాలు!

హీరోకు లోపముంటే సినిమా సక్సెస్..టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్!

స్కూల్ లో పరిచయం.. ఫేస్ బుక్ లో ప్రేమ.. దుల్కర్ లవ్ స్టోరీ మామూలుగా లేదే?

ENE Repeat రిలీజ్‌కు ముందే హీరోయిన్ ఎమోషనల్.. అసలు ఏమైందంటే?

ఆ ఒక్కపనితో అనుష్క శాశ్వతంగా టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిందా?

చెక్ బౌన్స్ కేసు… బండ్లన్నకు ఏడాది జైలు శిక్ష..భారీ జరిమాన?

రేణూ దేశాయ్ హెయిర్ స్టైలిస్ట్ ను చూశారా..ఎంత క్యూట్ గా ఉందో కదా!

Big Stories

Advertisement
×