Fish Venkat Death: టాలీవుడ్ సినీ నటుడు, ఫిష్ వెంకట్ (Fish Venkat)కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో విలన్ (Villain)పాత్రలలోను,కమెడియన్(Comedian) గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో(Health Issues) బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈయన రెండు కిడ్నీలు (Kidneys)పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈయన చికిత్స కోసం ఎవరైనా సహాయం చేయాలని ఆయన భార్య, కుమార్తె అందరిని వేడుకున్నారు.
తుది శ్వాస విడిచిన ఫిష్ వెంకట్…
ఇక ఫిష్ వెంకట్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిన నేపథ్యంలోనే గత కొద్దిసేపటి క్రితం కన్నుమూశారని తెలుస్తోంది. ఇలా ఫిష్ వెంకట్ మరణ వార్త తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలు ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడవడంతో ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేశారు. అయితే కిడ్నీ మార్పిడి కోసం సుమారు 50 లక్షలు వరకు ఖర్చు అవుతుందని అంత స్థోమత తమకు లేదని సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు, ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ ఆయన కుటుంబ సభ్యులు సహాయం కోరారు.
పూర్తిగా క్షీణించిన ఆరోగ్యం…
ఇలా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు పలువురు సినీ సెలబ్రిటీలు ఫిష్ వెంకట్ కు సహాయం చేశారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఈయన అనారోగ్యం పట్ల పెద్దగా స్పందించకపోయినా పలువురు హీరోలు మాత్రం స్పందిస్తూ కొంతమేర ఆర్థిక సహాయం చేశారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిన నేపథ్యంలోనే మరణించారని తెలుస్తుంది. ఇక ఫిష్ వెంకట్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా ద్వారా వెండితెరకు నటుడిగా పరిచయమయ్యారు. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలు అందరి సినిమాలలో కూడా విలన్ పాత్రలలోను కమెడియన్ గా కూడా నటించి మెప్పించారు.
ఫిష్ వెంకట్ మరణం తీరనిలోటు…
ఇక పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇలా సినిమా అవకాశాలు లేకపోవడంతోనే ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడాయని తెలుస్తోంది. ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గతంలో సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యల కారణంగానే సరైన చికిత్స తీసుకోలేక ఫిష్ వెంకట్ మరణించారని తెలుస్తుంది. ఫిష్ వెంకట్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పాలి. ఇక ఈయన మరణ వార్త తెలిసిన అభిమానులు తోటి నటీనటులు ఈయన మృతిపై స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read: SS Rajamouli: వైద్య వ్యర్థాలతో రాజమౌళి డ్రెస్.. అలా ఎలా వేయాలనిపించింది అశ్విన్?