The Raja Saab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రాలలో రిలీజ్ కి సిద్ధమవుతున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమాలోని ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కనిపించనుంది.
దర్శకుడు మారుతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఒక డిజాస్టర్ సినిమా కూడా మారుతీ తీయలేదు. ఈ రోజుల్లో సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన మారుతి నేడు పాన్ ఇండియా హీరోతో సినిమా చేసే రేంజ్ ఎదిగారు. ఆడియన్స్ ఎటువంటి సినిమాలు ఇష్టపడతారు. ఇటువంటి కామెడీ వర్కౌట్ అవుతుంది అని బాగా తెలిసిన వ్యక్తి మారుతి.
యుఎస్ లో ఈవెంట్ ప్లాన్ చేశారు
ఇక ప్రభాస్ రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న సందర్భంగా నవంబర్ 3వ వారంలో యూఎస్ లో ఒక ఈవెంట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే యూఎస్ లో ఈవెంట్ ప్లాన్ ఓకే కానీ తెలుగు ప్రేక్షకులకు ఎటువంటి సర్ప్రైజెస్ ఇవ్వబోతున్నారు అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పుడు మీడియా ఫ్యాక్టరీ ఎన్ని సినిమాలు నిర్మించిన కూడా సరైన పేరు ఇప్పటివరకు రాలేదు. అయితే రాజా సబ్ సినిమాతో ఆ పేరు వస్తుంది అని నిర్మాత విశ్వప్రసాద్ కూడా ఊహిస్తున్నారు.
ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మరోసారి
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే బుజ్జిగాడు, డార్లింగ్ ఆ టైంలో ప్రభాస్ చేసిన కామెడీ ఇప్పుడు మాత్రం మిస్ అవుతున్నారు. దానిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాడు మారుతి. కల్కి సినిమాలో కొంతవరకు ప్రభాస్ క్యారెక్టర్ని ఫన్నీగాని డీల్ చేశాడు నాగ అశ్విన్. అయితే ఇప్పుడు కంప్లీట్ గా ప్రభాస్ కామెడీ చేస్తే ఎలా ఉండబోతుంది అని చూపించబోతున్నాడు మారుతి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వర్క్ అవుట్ అయితే కలెక్షన్స్ తో పాటు, ప్రభాస్ అభిమానులకు కూడా ఒక మంచి ట్రీట్ ఇచ్చినట్లు ఉంటుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read: Ram Charan: రామ్ చరణ్ ను జీవితం ఆ గురు శిష్యులకే అంకితం, మరో ప్రాజెక్ట్ చెయ్యరా బాబు.?