Manchu Manoj : టాలీవుడ్ నటుడు శివాజీ దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అమ్మాయిల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సినీ ఇండస్ట్రీలో శివాజీ వ్యాఖ్యల పై చర్చలు మొదలయ్యాయి. మహిళలపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడంపై ఇప్పటికే పలువురు శివాజీపై మండిపడుతున్నారు. సినీ ఇండస్ట్రీలోని వ్యక్తులు సైతం ఆయన మాటలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. తాజాగా మంచు మనోజ్ కూడా శివాజీ పేరు ఎత్తకుండానే ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదని అన్నారు. ఈ సందర్బంగా తన సోషల్ మీడియా వేదికగా ఒక లెటర్ ను పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. అందులో ఏముందో కాస్త వివరాల్లోకి వెళ్లి చూద్దాం..
మహిళ వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇండస్ట్రీలో ప్రస్తుతం దీనిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇప్పటికే సింగర్ చిన్మయి, అనసూయ శివాజీని విమర్శించగా.. తాజాగా సినీ నటుడు మంచు మనోజ్ ఒక లెటర్ ను తన ఎక్స్ వేదికగా రిలీజ్ చేశారు. అందులో ఏం రాసి ఉందంటే.. మహిళల దుస్తుల విషయంలో నీతులు చెప్పడం, వారిపై నైతిక బాధ్యత లేదు అని ఆరోపించడం అనేది చాలా పురాతన ఆలోచన .. ఈరోజుల్లో ఎవరి ఇలాంటివి ఆలోచించడం లేదు.. తీవ్ర నిరాశను కలిగించాయి. భారత్ రాజ్యాంగం ప్రకారం.. ఆర్టికల్ 14, 15, 21లను ఉల్లంఘించేలా ఉన్నాయని మనోజ్ గుర్తు చేశారు. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ అనేవి చర్చించలేని అంశాలని మహిళల వస్త్రాల గురించి ఎక్కడా మాట్లాడే, ప్రశ్నించే హక్కు లేదు. ఎవరికి అధికారం లేదు. మహిళలను కించపరిచేలా మాట్లాడే వారు రాజ్యాంగం హక్కులని తెలుసుకోవాలని ఆయన తేల్చి చెప్పేసారు. పెద్ద నటుడు అయ్యిండి ఇలాంటి మాటలు మాట్లాడటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను.. ఆయన తరపున మహిళలని నేను క్షమాపణలు కోరుతున్నాను.. పబ్లిక్ ఫిగర్స్‌గా ఉన్నవారు సమాజంపై తమ మాటల ప్రభావం ఉంటుందని గుర్తించి బాధ్యతగా మాట్లాడాలని ఆయన గుర్తు చేశారు. ఇకమీదట ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే సహించేది లేదు అని ఆ పోస్టులో మనోజ్ రాసుకోవచ్చారు. ప్రస్తుతం మనోజ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Also Read : ఇది మా బాడీ.. మా ఇష్టం… మీకేం నొప్పి… శివాజీకి అనసూయ కౌంటర్..
నటుడు శివాజీ నటిస్తున్న దండోరా సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు చిత్ర యూనిట్. ఆ ఈవెంట్లో నటుడు శివాజీ మాట్లాడుతూ మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దరిద్రపు ముండా అంటూ సంబోధిస్తూ ఆయన మాట్లాడిన తీరు మహిళలను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. సావిత్రి, సౌందర్య వంటి వారిని చూసి నేర్చుకోవాలని ఆయన చేసిన సూచనలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి.. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సినీ తారలు ఒక్కొక్కరుగా స్పందిస్తూ మండిపడుతున్నారు. మరి ఈ వివాదంపై నటుడు శివాజీ ఎలా స్పందిస్తారో చూడాలి..
Came across some deeply disappointing comments last night.
A civilised society protects women’s rights instead of policing their choices. #RespectWomen #RespectYourself pic.twitter.com/ym3CmPsxgD
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 23, 2025
రాజ్యాంగాన్ని ధిక్కరించడమే.. శివాజీకి మంచు మనోజ్ కౌంటర్#ManchuManoj #ActorSivaji #Dandora #Heroines #Tollywood #BiggBossTelugu #BIGTVCinema pic.twitter.com/FkPEO8My1V
— BIG TV Cinema (@BigtvCinema) December 23, 2025