Actor Nani టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నాచురల్ స్టార్ నాని(Nani) ఒకరు. సినిమాలపై ఆసక్తితో ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న నాని అనంతరం అలా మొదలైంది సినిమాతో హీరోగా అవకాశాన్ని అందుకున్నారు. ఇలా హీరోగా మొదలుపెట్టిన నాని వరుస సినిమా అవకాశాలను అందుకుంటు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం నాని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి హిట్ కొడుతున్నాయి. ఇక నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే.
హీరోగా, నిర్మాతగా సక్సెస్ కొట్టిన నాని…
ఇటీవల కోర్టు సినిమా ద్వారా నిర్మాతగా హిట్టు కొట్టిన నాని హిట్ 3 సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈయన “ది ప్యారడైజ్”(The Paradise) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని 2026 మార్చి 26వ తేదీ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇలా ఈ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న నాని మరోవైపు సోషల్ మీడియాలోనూ అలాగే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తనకు తన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు.
రజనీకాంత్ బయోపిక్ సినిమా…
ఈ క్రమంలోనే తాజాగా తన మనసులో ఉన్న కోరికను కూడా ఈయన బయటపెట్టారు. తనకు ఒక స్టార్ హీరో బయోపిక్ సినిమాలో నటించాలని ఉంది అనే విషయాన్ని తెలియజేశారు. “తనకి ఎప్పుడైనా బయోపిక్ సినిమా(Biopic Movie) చేసే అవకాశం కనుక వస్తే తప్పకుండా సూపర్ స్టార్ రజనీకాంత్(Rajini Kanth) బయోపిక్ సినిమా చేస్తానని తెలిపారు. అది కేవలం ఒక బయోపిక్ సినిమా మాత్రమే కాదు నా కలల ప్రాజెక్ట్” అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి రజనీకాంత్ బయోపిక్ సినిమా చేసే అవకాశం నానికి వస్తుందా? ఇది సాధ్యమయ్యే పనేనా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
చిరంజీవితో నాని సినిమా…
ఇక నాని ది ప్యారడైజ్ సినిమా పూర్తి కాగానే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించగా, నాని నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదివరకే నాని శ్రీకాంత్ ఓదెలతో కలిసి దసరా అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. ఇలా ఈయన హీరోగా నిర్మాతగా ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. టైర్ 2 హీరోలలో నాని నెంబర్ వన్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ పనులలో ఈయన బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తుంది. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమాపై మంచి అంచనాలని పెంచేస్తున్నాయి.
Also Read: Kalpika Ganesh: నాపై రే** జరిగింది… షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన కల్పిక!