Hero Nani : టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన. తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. ఈ మధ్య నాని నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నారు.. డిఫరెంట్ స్టోరీ తో రాబోతున్న ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా థియేటర్లోకి రాబోతున్న నేపథ్యంలో నానే చేతికి గాయం అయిందంటూ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అసలు నానికి ఏమైంది..? ఎందుకు ఆయన చేతికి గాయాలు అయ్యాయి అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
హీరో నాని ఈమధ్య యాక్షన్ సినిమాలనే ఎక్కువగా చేస్తున్నారు. ఈ ఏడాది వచ్చిన హిట్ 3 బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీ లో నటిస్తున్నాడు.. అయితే తాజాగా హీరో నాని చేతికి గాయమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. హీరో నాని తన సోషల్ మీడియా లేదు కదా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలలో చేతికి కట్టు కట్టి ఉంది. ఎడమచేతి మోచేతికి బ్యాండేజ్ కట్టి ఉండటం ఫోటోల్లో కనిపిస్తోంది. గాయల్ హు.. ఇస్లీయే ఘాతక్ హు అంటూ దురంధర్ సినిమా డైలాగ్ క్యాప్షన్ కూడా పెట్టారు.. గాయం గురించి మాత్రం నాని క్లారిటీ ఇవ్వలేదు కానీ ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అసలు హీరో నాని కి ఏమైంది ఎక్కడ గాయం అయింది? ప్రస్తుతం ఆయన చేయి పరిస్థితి ఎలా ఉంది? అంటూ నాని ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.. ఈ క్రేజీ అప్‌డేట్‌తో జూలై నెలను ప్రారంభించిన నాని త్వరలోనే యాక్షన్ మూవీలో జాయిన్ అవ్వబోతున్నాడు.. ఏది ఏమైనా నాని చేతికి గాయం అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నానిని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.. మరి దీనిపై నాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..
Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. జూన్ నెల హైలెట్స్..
హీరో నాని బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటిస్తూ ఇమేజ్ ని పెంచుకుంటూ వస్తున్నాడు.. గత కొన్నేళ్లుగా నాని ఖాతాలో సూపర్ హిట్ చిత్రాలు మాత్రమే పడుతున్నాయి.. ఈ ఏడాది హిట్ 3 మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.. నాని అకౌంట్లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ మూవీ నిలిచింది. అలాగే ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల కాంబోలో ది ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు.. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా ఆయా షేర్ సాంగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో కేజీని సంపాదించుకుందో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.. మరి థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..