Best Mystery Movies: రియల్ లైఫ్ లో పరిష్కారం కాని ఎన్నో కేసుల గురించి విని ఉంటారు. ఇప్పటికీ సాల్వ్ అవ్వకుండా ఉన్న మిస్టరీస్ గురించి తెలుసుకుని ఉంటారు. కానీ అవన్నీ సినిమాల రూపంలో వస్తే, స్క్రీన్ పై చూడడానికి ఎంత బాగుంటుందో కదా. అలా అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన అంతుచిక్కని రహస్యాల సినిమాలే ఈ రోజు మన మూవీ సజెషన్. వీటిలో ఇప్పటికీ సమాధానాలు దొరకని రహస్యాలు, అంతుచిక్కని కేసులు చాలా ఉన్నాయి. ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
2008లో విడుదలైన ఈ ఆస్ట్రేలియన్ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. 16 ఏళ్ల బాలిక ఒక సరస్సులో మునిగి చనిపోతుంది. అంత్యక్రియల సమయంలో ఆమె కుటుంబం ఎదుర్కొన్న భయంకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటనలు క్రమంగా వెలుగులోకి వస్తాయి. హారర్ ఫ్యాన్స్ ఈ సినిమాను డోంట్ మిస్.
1993లో వచ్చిన ఈ సినిమా ఏలియన్ అపహరణ రహస్యాలపై ఆధారంగా రూపుదిద్దుకుంది. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన ఒక కట్టెలవాడు తిరిగి వచ్చి, తనను ఏలియన్లు తీసుకుపోయారని చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది. సైన్స్ ఫిక్షన్ అండ్ హారర్ మిక్స్చర్ ఇష్టపడే వారికి ఈ సినిమా సూపర్ ఎంటర్‌టైనింగ్ గా ఉంటుంది.
1900లో ఆస్ట్రేలియాలో జరిగిన రియల్ లైఫ్ రహస్యం ఆధారంగా తీసిన ఈ సినిమా… ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. హ్యాంగింగ్ రాక్స్ వద్ద విహారయాత్రకు వెళ్లిన కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయుడు అప్పట్లో అదృశ్యమయ్యారు. సంవత్సరాలు గడిచినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ స్టోరీనే సినిమాగా తీశారు.
1973లో చిలీలో జరిగిన సైనిక తిరుగుబాటు సమయంలో అమెరికన్ జర్నలిస్ట్ చార్లెస్ హోర్మాన్ అదృశ్యం కావడాన్ని ఈ సినిమాలో చూడవచ్చు. ఆయన కుటుంబం ఆయనను వెతికే ప్రయాణంలో నెలకొన్న రాజకీయ కుట్రలు, మానవ హక్కుల ఉల్లంఘనలు బయట పడతాయి. ఆ తరువాత ఏం జరిగిందన్నది కథ.
వెస్ట్ వర్జీనియాలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఇందులో భారీ రెక్కలు, ఎర్రటి కళ్లతో ఉన్న మనిషి లాంటి జీవి అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంది. ఆ జీవి వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి ? సినిమా చివరికల్లా అది వెల్లడవుతుందా ? అనేది స్టోరీ. ఈ సినిమాలన్నీ ఒక్క అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే అందుబాటులో ఉండడం విశేషం.
Read Also : అందాల పోటీలో పాల్గొనే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… బ్రూటల్ మర్డర్స్ తో మతిపోగొట్టే థ్రిల్లర్