Actor Ajith Kumar: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు అజిత్ కుమార్(Ajith Kumar) ఒకరు. ఇప్పటివరకు సుమారు 60 కి పైగా సినిమాలలో నటించి ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. హీరో అజిత్ కు సినిమాలు మాత్రమే కాదు రేసింగ్ అంటే కూడా పిచ్చి అనే సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎన్నో దేశాలలో కార్ రేస్ లలో పాల్గొంటూ పథకాలను కూడా సాధించారు. ఇలా రేసింగ్ అంటే ఎంతో ఇష్టం ఉన్న అజిత్ కుమార్ ఏకంగా తన పేరు మీద పందెం పోటీల సంస్థన కూడా ప్రారంభించారు. ఇలా తన సొంత టీంతో కలిసి ఈయన పలు దేశాలలో ఈ రేసు లో పోటీలు చేశారు.
ఇక ఈయన సినిమాల విషయానికొస్తే అజిత్ కుమార్ చివరిగా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం తన తదుపరి సినిమా పనులలో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అజిత్ కుమార్ తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాను సినిమాలు, రేసింగ్ అంటూ సరైన సమయాన్ని తన కుటుంబంతో గడపలేక పోతున్నానని తెలిపారు. తాను ఈ పనులలో బిజీగా ఉండటం వల్ల తన భార్య శాలిని(Shalini) అన్ని బాధ్యతలను తీసుకున్నారని ఆమె సహకారం లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదని తెలిపారు.
ఇటీవల కాలంలో తాను తన పిల్లల్ని చూడటం కూడా చాలా అరుదుగా మారిపోయింది అయితే మనకు నచ్చింది చేయాలి అనుకుంటే పలు సందర్భాలలో కొన్ని త్యాగాలు కూడా చేయాల్సిందేనని వెల్లడించారు. అదేవిధంగా తాను రోజు నిద్రపోవడం కోసం ఎంతో కష్టపడతానని ఈయన షాకింగ్ విషయాలను బయటపెట్టారు. తనకు స్లీపింగ్ డిజార్డర్(Sleeping Disorder) ఉన్న నేపథ్యంలో నిద్ర పెద్దగా పట్టదని అతి కష్టం మీద రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని ఈ సందర్భంగా అజిత్ కుమార్ తనకున్న సమస్య గురించి కూడా బయటపెట్టారు.
సోషల్ మీడియా గొప్ప సాధనం..
ఇక సోషల్ మీడియా గురించి కూడా తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. మనం ఏదైనా అద్భుతాలు చేయటానికి సోషల్ మీడియా గొప్ప సాధనమని తెలిపారు. సోషల్ మీడియా నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి వెసులుబాటు ఉంటుందని అజిత్ సోషల్ మీడియా గురించి కూడా ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక తనకు సినిమాలు రేసింగ్ అంటే చాలా ఇష్టం కావడంతో నా ఇష్టాలను తన పిల్లలపై ఎప్పటికీ రుద్దనని, వారికి ఇష్టమైన రంగంలో వారు కొనసాగడానికి ప్రోత్సహిస్తానని వెల్లడించారు. ఇకపోతే అజిత్ కుమారుడు అద్విక్ (Advik)కూడా రేసింగ్ ఇష్టపడుతున్నారని, అయితే పూర్తిస్థాయిలో రేసింగ్ పై దృష్టి పెట్టడం లేదంటూ అజిత్ కుమార్ ఈ సందర్భంగా తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.
Also Read: The Raja Saab: ట్రైలర్ ఎఫెక్ట్… రాజాసాబ్ స్పెషల్ షో చూసిన ప్రభాస్… రియాక్షన్ ఏంటంటే ?