Raja Ravindra : టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజా రవీంద్ర (Raja Ravindra ) పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటిస్తూ మరోవైపు సినీ హీరో, హీరోయిన్లకు మ్యానేజర్ గా వ్యవహారిస్తున్నారు. ఈయన 1993 లో వచ్చిన నిప్పురవ్వ అనే సినిమా రాజా రవీంద్ర మొదటి సినిమా. ఆ తర్వాత సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈయన ముందుగా సీరియల్స్ లో నటిస్తూ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అటు వరుస సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న ఈయనకు హీరో రవితేజ మేనేజర్ గా పనిచేసారు. బలవంతంగా రవితేజ తనను మేనేజర్ ను చేశాడని గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. ఇద్దరి మధ్య ఏదో గొడవలు జరిగి విడిపోయారని వార్తలు వినిపించాయి.. దానిపై ఇటీవలే ఆయన స్పందించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. రాజా రవీంద్ర కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది.. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఒకింత షాక్ అవుతున్నారు..
రాజా రవీంద్ర గ్రేట్ అబ్బా..
టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అయినా వయసుకి అంత బరువు ఎత్తడం మామూలు విషయం కాదంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.. దాదాపు 150 కేజీల బరువుని ఆయన మోయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. జిమ్ లో ఆయన చేసిన ఈ సాహసానికి ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటివరకు నటుడిగా, మేనేజర్ గా పని చేస్తూ అందరికీ పరిచయమైన ఈయన ఇప్పుడు ఇలా వెయిట్ లిఫ్టింగ్ చేయడంతో పోటీల్లో ఏమైనా పాల్గొంటాడేమో అన్న సందేహం కూడా అందరికీ వస్తుంది.. ఏది ఏమైనా కూడా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Also Read : రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..
రాజా రవీంద్ర సినిమాలు, పర్సనల్ లైఫ్…
రాజా రవీంద్ర ఆంధ్రప్రదేశ్ భీమవరంలో జన్మించాడు. ఈయన ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడని ఆయనే అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. భీమవరంలోనే విద్యాభాస్యం పూర్తి చేశారు. ఆ తర్వాత నటన పై ఆసక్తితో ప్రయత్నాలు చేశారు. మొదట సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చింది. అలా ఆయనకు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. పలు సీరియల్స్ లలో నటించి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 1993 లో వచ్చిన నిప్పురవ్వ అనే సినిమా రాజా రవీంద్ర మొదటి సినిమా.. అలా ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ ఎన్నో సినిమాల్లో నటించి ప్రముఖ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు అయినా వందకు పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో కీలక పాత్రలో నటిస్తూనే.. మరోవైపు హీరో, హీరోయిన్లకు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఓ రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నారని సమాచారం. అంతేకాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న కొన్ని ఈవెంట్లలో రాజా రవీంద్ర సందడి చేస్తూ వస్తున్నారు..