OTT Movie : మలయాళం సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఫ్యాన్స్ అయిపోయారు. ఎప్పుడు ఈ సినిమాలు వచ్చినా ఓ లుక్ వేస్తున్నారు. సినిమా బాగుంటే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఈ సినిమాలు రియలిస్టిక్ గా ఉండటంవల్లే అంత గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. రీసెంట్ గా ఒక అడవి నేపథ్యంలో వచ్చిన థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఎనిమిది నెలల తరువాత దీనికి మోక్షం వచ్చింది. ఈ స్టోరీ రివేంజ్ థ్రిల్లర్ గా, ఒక ఆసక్తికరమైన కథనంతో నడుస్తుంది. ఈ సినిమా థ్రిల్లర్ ఫ్యాన్స్ కి బాగా సూట్ అవుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘చట్టూలి’ (Chattuli) అనే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి రాజ్ బాబు దర్శకత్వం వహించారు. లీడ్ రోల్స్‌లో షైన్ టామ్ చాకో, జాఫర్ ఇదుక్కి, కలభావన్ షాజాన్, కార్తిక్ విష్ణు, శ్రుతి జయన్ నటించారు. 2025 ఫిబ్రవరి 21న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా, అక్టోబర్ 20 నుంచి మనోరమా మాక్స్‌లో ఓటీటీలో అందుబాటులో ఉంది.
సినిమా కేరళలోని అట్టప్పాడి అడవుల్లో మొదలవుతుంది. ఈ అడవి చాలా డేంజరస్ గా ఉంటుంది. అక్కడ మారి అనే అంధ వృద్ధుడు ఒంటరిగా నివసస్తుంటాడు. మారికి గతంలో జరిగిన ఒక పెద్ద అన్యాయం వల్ల, ఎవరిపైనో ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటుంది. అతనికి ఆ అడవి గురించి బాగా తెలుసు. సౌండ్స్, స్మెల్స్ ద్వారా దారి కనిపెడతాడు. జంతువులను గురిస్తాడు. ఇదే సమయంలో, కార్తిక్ అనే ఒక యువకుడు అడవిలో మారిని కలుస్తాడు. కార్తిక్ కూడా తన గతంలో ఒక ట్రాజీడీ ఉంటుంది. కార్తిక్ అడవిలో తప్పిపోయి, మారి హెల్ప్ తీసుకుంటాడు. ఇద్దరూ తమ బాధల గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళ మధ్య ప్రతీకారం కోసం ఒక బాండ్ ఫామ్ అవుతుంది.
Read Also : కోరికలతో అల్లాడే శవం… ప్రాణం పోసిన వాడితోనే… ఈ దెయ్యానికి ఒంటరి మగాడు దొరికితే దబిడి దిబిడే
మారి, కార్తిక్ కలిసి అడవిలో ఒక జర్నీ స్టార్ట్ చేస్తారు. మారి తన గతం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అతను ఒకప్పుడు ట్రైబల్ కమ్యూనిటీలో రెస్పెక్టెడ్ మనిషి. కానీ లోకల్ పొలిటీషియన్ వల్ల అతని ల్యాండ్ తో సహా ఫ్యామిలీని కూడా కోల్పోయాడు. కార్తిక్ కూడా తన స్టోరీలో అతని ఫ్యామిలీకి జరిగిన అన్యాయం గురించి చెప్తాడు. ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. అడవిని ఉపయోగించి తమ ఎనిమీస్‌ను ట్రాప్ చేయడం మొదలు పెడతారు. ఈ ట్రాప్ లో విలన్స్ పడతారా ? వీళ్ళకు జరిగిన అన్యాయం ఏమిటి ? వీళ్ళ రివేంజ్ తీరుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.