Ravi Kishan:ప్రముఖ భోజ్ పురి నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు రవికిషన్ (Ravi Kishan) . ఒకవైపు అక్కడ పలు చిత్రాలలో నటిస్తూ స్టార్ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన .. ఇటు తెలుగులో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన ‘రేసుగుర్రం’ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి కిషన్ ఎన్నో ఎమోషనల్ కామెంట్స్ చేసి అభిమానులను సైతం కంటతడి పెట్టించారు. అందులో భాగంగానే తన బాల్యం గురించి చెప్పుకొచ్చి ఎమోషనల్ అయ్యారు.
అందుకే మా నాన్న చనిపోయినా ఏడవలేదు – రవికిషన్
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి కిషన్ మాట్లాడుతూ.. “నా బాల్యమంతా కష్టాల్లోనే గడిచింది. చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడు కూడా నాతో మాట్లాడేవాడు కాదు. అసలు ప్రేమగా చూసుకున్న ఒక్కరోజు లేదు. ప్రతిరోజు విపరీతంగా కొట్టేవాడు. నేను పడే బాధ చూసి మా అమ్మ తట్టుకోలేక ఒకరోజు 500 రూపాయలు నా చేతిలో పెట్టి ఎక్కడికైనా పారిపోయి బ్రతుకు.. లేదంటే చంపేస్తాడు అని చెప్పింది. అందుకే మా నాన్న చనిపోయినా మొదట నేను వెళ్లలేదు. కానీ అమ్మ కోసం వెళ్లినా.. ఆయన చనిపోయాడు అని తెలిసి కూడా నాకు కన్నీళ్లు రాలేదు” అంటూ రవికిషన్ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే తన తండ్రి తనను చాలా దారుణంగా హింసించేవాడని , తన తండ్రి కారణంగా అమూల్యమైన బాల్యం అంతా కష్టాల మయం అయ్యింది అని రవికిషన్ ఎమోషనల్ అయ్యారు.. ప్రస్తుతం రవికిషన్ షేర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రవి కిషన్ నటించిన తెలుగు చిత్రాలు..
రేసుగుర్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రవి కిషన్.. ఆ తర్వాత కిక్ 2, సుప్రీం, ఒక అమ్మాయి తప్ప, అబద్ధం, ఎమ్మెల్యే, ఎన్టీఆర్ కథానాయకుడు, సైరా నరసింహారెడ్డి, 90 ఎం.ఎల్, హీరో, డాకు మహారాజ్ వంటి చిత్రాలలో నటించారు. ఇక ప్రస్తుతం హిందీలో ‘సన్ ఆఫ్ సర్దార్-2 ‘ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ కూడా విడుదలవగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
తండ్రి అడుగుజాడల్లోనే కూతురు కూడా..
రవి కిషన్.. ప్రీతి శుక్లా ను వివాహం చేసుకున్న తర్వాత నలుగురు సంతానం కలిగారు. అందులో ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి ఆర్మీలో చేరి దేశానికి సేవలు అందిస్తూ ఉండగా.. చిన్నమ్మాయి రివా కిషన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అటు డాన్స్ ఇటు నటనలో శిక్షణ తీసుకున్న ఈమె.. ఒక హిందీ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు టెక్స్టైల్ ఫ్యాషన్ బ్రాండ్ ను ఓపెన్ చేసి బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక తండ్రి బాటలోనే ఇటు భారీ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతోంది రివా కిషన్.
ALSO READ:Harihara Veeramallu: ఘనంగా హరిహర వీరమల్లు సక్సెస్ మీట్.. ఎక్కడ? ఎప్పుడంటే?