BigTV English
Advertisement

Harihara Veeramallu: ఘనంగా హరిహర వీరమల్లు సక్సెస్ మీట్.. ఎక్కడ? ఎప్పుడంటే?

Harihara Veeramallu: ఘనంగా హరిహర వీరమల్లు సక్సెస్ మీట్.. ఎక్కడ? ఎప్పుడంటే?

Harihara Veeramallu: ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ హరిహర వీరమల్లు(Harihara Veeramallu). శ్రీ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం(AM Ratnam) భారీ బడ్జెట్ తో నిర్మించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్గా వచ్చిన ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావు(Kota Srinivas Rao) చివరిసారిగా నటించడం గమనార్హం. ఇక ఈయనతోపాటు నాజర్, బాబీ డియోల్, సత్యరాజ్, సునీల్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య జులై 24న విడుదల కావలసి ఉండగా.. ఒకరోజు ముందుగానే అభిమానుల కోసం జూలై 23 రాత్రి 9:45 గంటలకే ప్రీమియర్ షోలు పడిపోయాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 2300కు పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.


“గ్రాండ్ సక్సెస్” పేరిట హైదరాబాదులో వీరమల్లు మీడియా మీట్..

ఇదిలా ఉండగా మొదటి షోకి పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు ఉత్సాహంతో చిత్ర బృందం గ్రాండ్గా సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హైదరాబాదులోని దసపల్లా హోటల్లో ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు చాలా గ్రాండ్ గా హరిహర వీరమల్లు సినిమా గ్రాండ్ సక్సెస్ పేరుతో మీడియా మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఈ హోటల్లో జరిగే ప్రెస్ మీట్ కి హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ జ్యోతి కృష్ణ, చిత్ర నిర్మాత ఏ.ఎం.రత్నం తోపాటు చిత్ర బృందం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు త్రివిక్రమ్ (Trivikram) తో పాటు మరికొంతమంది ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా రాబోతున్నట్లు సమాచారం.


హరిహర వీరమల్లుతో సత్తా చాటిన పవన్..

యాక్సిడెంటల్ హీరోగా మారిన పవన్ కళ్యాణ్ తన స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎదుగుతూ.. నేడు స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి ఇన్నాళ్లు దూరంగా ఉన్న ఈయన.. తన నటనతో మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకోవడంలో దిట్ట అని నిరూపించారు. దాదాపు రెండేళ్ల తర్వాత తెరపై కనిపించిన పవన్ కళ్యాణ్.. మరొకసారి తన సత్తా చాటుతూ హరిహర వీరమల్లు సినిమాతో రికార్డు సృష్టించడానికి సిద్ధం అయిపోయారు. ఇప్పటికే ప్రీమియర్ షో తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో మొదటిసారి నటించినా.. సినిమాని తన భుజస్కంధాలపై మోసి నిర్మాతను సేఫ్ జోన్ లోకి నెట్టేశారు. రావడం ఆలస్యం అవ్వచ్చు కానీ హిట్ గ్యారెంటీ అని మరొకసారి నిరూపించారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ సినిమాలు..

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా పాజిటివ్ టాక్ తో జోష్ మీద ఉన్నారు. అందులో భాగంగానే సక్సెస్ మీట్ నిర్వహించడానికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత హరిహర వీరమల్లు 2 ఉంటుందని.. దీనికి ‘యుద్దభూమి’ అని హరిహర వీరమల్లు క్లైమాక్స్లో టైటిల్ రివీల్ చేశారు.

ALSO READ:Udaipur files: ఉదయపూర్ ఫైల్స్.. నేడే అంతిమ తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ!

Related News

Prakash Raj: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్టు ఫైర్

Megastar Chiranjeevi : అన్నపూర్ణ స్టూడియోలో మన శంకరవరప్రసాద్ గారు, సినిమా పూర్తయ్యేది అప్పుడే

Sai Durgha Tej : స్టార్డం అంటే హీరోలతో ఫోటోలు దిగడం కాదు, సాయి తేజ్ అలా అనేశాడేంటి?

Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం

Thiruveer: ఆ సినిమా టికెట్ కౌంటర్ లోనే చచ్చిపోతా అనుకున్నా

Kaantha First Spark: దుల్కర్ కాంత.. చాలా గట్టిగానే ఉండబోతున్నట్టుందే

Parasakthi: సింగారాల సీతాకోకవే.. ఏముందిరా సాంగ్.. నెక్స్ట్ లెవెల్ అంతే

Ustaad Bhagat Singh : సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ, మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి?

Big Stories

×