Visakha Fire accident: ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయి. ఒకటి మరువక ముందే మరో అగ్ని ప్రమాదం అవుతుంది. అయితే నేడు విశాఖలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్ర యూనివర్సిటీ అవుట్ గేటు వద్ద ఉన్న మధు బేకరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల భారీగా పొగ వ్యాపించింది. వెంటనే అక్కడి సమీపంలోని స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయాగా.. వెంటనే స్పందించి ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపు చేశారు.
Also Read: ఉప్పాడ తీరంలో రాకాసి అలల.. సముద్రంలోకి 3 గ్రామాలు..
అయితే ఈ ఘటనకు కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.. కానీ, భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం తెలిపారు.
విశాఖలో అగ్ని ప్రమాదం
ఆంధ్రా యూనివర్సిటీ అవుట్ గేట్ వద్ద ఉన్న బేకరీలో అగ్ని ప్రమాదం
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం
మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది pic.twitter.com/NUmH1IrwCN
— BIG TV Breaking News (@bigtvtelugu) July 24, 2025