Meenakshi Chaudhary:సినిమా ఇండస్ట్రీలో ఎడిట్ చేసిన ఫోటోలు, పుకార్లు రావడం ఇప్పుడు కొత్తేమీ కాదు. కానీ నటి మీనాక్షి చౌదరి మాత్రం తనపై వచ్చిన పెళ్లి, డేటింగ్ వార్తలను చాలా కూల్‌గా, క్లియర్‌గా కొట్టిపడేసింది. సుశాంత్‌తో తనది మంచి స్నేహం మాత్రమేనని, పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అసలు గాసిప్స్‌ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ ధోరణి వెనుక ఉన్న కోణమేంటో చూద్దాం..
‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమా నుంచి మీనాక్షి, సుశాంత్ మంచి స్నేహితులుగా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియాలో కొందరు ఫోటోలు ఎడిట్ చేసి పెళ్లి రూమర్స్ పుట్టించారు. వాటికి అనవసరంగా రియాక్ట్ అవ్వకుండా, “ఇవన్నీ ఇండస్ట్రీలో కామన్ అయిపోయాయి, నేను ఇప్పుడు సింగిల్” అని మీనాక్షి చెప్పడం ఆమె మెచ్యూరిటీని చూపిస్తోంది. ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో వీరిద్దరూ పక్కపక్కనే ఉన్న ఫోటోని ఎడిట్ చేసి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ చేస్తున్నారు అంటూ ఆ ఫోటోని యాంకర్ చూపించగా.. దీనికి ఆమె మాట్లాడుతూ .. “ఇది నా మొదటి సినిమా పూజ కార్యక్రమాలు అప్పుడు తీసుకున్న ఫోటో” అంటూ నిజం తెలియని విషయాలపై అనవసరంగా ఆలోచించడం కంటే, క్లారిటీ ఇచ్చి వదిలేయడమే మంచిదని భావిస్తున్నట్లు తెలిపింది. మొత్తానికైతే ఇన్ని రోజులు వైరల్ అయిన ఈ ఫోటోకి మీనాక్షి ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది.
నైట్ షూట్స్ ఇచ్చిన షాక్:
నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా కోసం మీనాక్షి పడిన కష్టం కూడా ఓ ఇంటర్వ్యూ లో తెలిపింది. కథ విని ఎగ్జైట్ అయినా, సినిమా అంతా నైట్ షూట్స్‌లో జరగడం ఆమెకు పెద్ద సవాల్‌గా మారింది. సాధారణంగా 10 నుంచి 14 గంటలు నిద్రపోయే అలవాటున్న మీనాక్షికి, ఈ షూటింగ్ నిద్రలేని రాత్రులు మిగిల్చింది. ఇక కెరీర్ కోసం తన కంఫర్ట్ జోన్ దాటి ఇలా కష్టపడటం ఆమె అంకితభావానికి నిదర్శనం.
also read:సుకుమార్ పై పందెం గెలిచిన అల్లు అరవింద్!
బిజీ షెడ్యూల్స్, షూటింగ్ ఒత్తిళ్ల మధ్య తనను తాను రిఫ్రెష్ చేసుకోవడానికి మీనాక్షి ప్రకృతిని ఆశ్రయిస్తోంది. కేవలం జిమ్‌కే పరిమితం కాకుండా, బయట తిరగడం, ట్రావెల్ వ్లాగ్స్ చేయడం, స్కై డైవింగ్ చేయాలనుకోవడం వంటివి ఆమెలోని అడ్వెంచర్ సైడ్‌ను చూపిస్తున్నాయి. ఇక నిజమైన సంతోషం, ప్రశాంతత మన చుట్టూ ఉన్న కొత్త అనుభవాలలోనే ఉంటాయని ఆమె నమ్ముతోంది.
కథల ఎంపికలో కొత్తదనం కోసం ఆరాటపడే మీనాక్షి ఇప్పుడు మరో విభిన్నమైన ప్రయాణానికి సిద్ధమయ్యారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ బి కలిసి నిర్మించిన ‘వృషకర్మ’ డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో స్పర్శ్ శ్రీవాస్తవ్, జయరామ్, నాగేంద్ర కుమార్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ కొత్త ప్రపంచం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ పెరుగుతోంది.
సోషల్ మీడియాలో వచ్చే అనవసరపు రూమర్స్‌కు చెక్ పెడుతూ, తన కలలు, సినిమాలపైనే మీనాక్షి పూర్తి ఫోకస్ పెట్టింది. పుకార్లను సీరియస్‌గా తీసుకోకుండా లైట్ తీసుకునే ఈ స్వభావమే, ఇండస్ట్రీలో ఒత్తిడిని తట్టుకుని నిలబడటానికి సాయపడుతుంది. ఇక తన ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి కొత్త అనుభవాన్ని ఆమె ఎంతో పాజిటివ్‌గా తీసుకుంటోంది.