E-Paper
Advertisement

సుకుమార్ పై పందెం గెలిచిన అల్లు అరవింద్!

సుకుమార్ పై పందెం గెలిచిన అల్లు అరవింద్!
Advertisement

Allu Aravind:సినిమా ఇండస్ట్రీలో సినిమాపై అంచనాలు పెంచడానికి.. ఆడియన్స్ లో క్యూరియాసిటీ కలిగించడానికి చిత్ర బృందం ఎప్పటికప్పుడు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్న విషయం తెలిసిందే..అందులో ముఖ్యంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) గురించి చెప్పుకోవాలి. టాలీవుడ్లో సినిమా ప్రమోషన్లకు కొత్త పంథాను పరిచయం చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. సినిమా మీద నమ్మకం ఉంటే దానిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ఆయన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. అంతేకాదు స్టార్ సెలబ్రిటీలను కూడా టార్గెట్ గా చేసుకొని వారికి ఛాలెంజ్లు విసురుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

సుకుమార్ కి పందెం విసిరిన అల్లు అరవింద్..

ఈ క్రమంలోనే తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ఆకాశంలో ఒక తార. దుల్కర్ సల్మాన్ హీరోగా, సాత్విక వీరవల్లి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమాని అల్లు అరవింద్ నిర్మించారు. అయితే ఈ సినిమా విషయంలో అల్లు అరవింద్ వేసిన మాస్టర్ ప్లాన్ అందరి దృష్టిని సినిమా వైపు చూసేలా చేసింది. ముఖ్యంగా నేషనల్ అవార్డు విన్నర్ సుకుమార్ (Sukumar ) కే ఆయన చాలెంజ్ విసరడం గమనార్హం . నవంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాని చూడాలని సుకుమార్ కు అరవింద్ ఫోన్ చేశారు. అయితే మామూలుగా సినిమా చూడమని చెప్పి సరిపెట్టలేదు. ఒక ఆసక్తికరమైన పందెం కూడా వేశారు అల్లు అరవింద్.

Advertisement

Image

 

కన్నీళ్లు పెట్టుకోకుంటే కోటి రూపాయలు..

Advertisement

థియేటర్లలో ఆకాశంలో ఒక తార సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు కన్నీళ్లు పెట్టుకోకుండా బయటకు వస్తే సుకుమార్ కి కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. అదే ఎమోషనల్ కి కనెక్ట్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం సుకుమార్ తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని పందెం వేశారు అల్లు అరవింద్. అయితే సినిమా చూసిన తర్వాత సుకుమార్ కి ఆ పందెంలో గెలిచే అవకాశం లేకుండా పోయింది. కథలోని భావోద్వేగాలకు సుకుమార్ బాగా కనెక్ట్ అయిపోయారు.

ALSO READ:త్రిగుణ్ తో నాకు పోటీ ఏంటి?: ముఖేష్

ఓడిపోయిన సుకుమార్..

అంతేకాదు తన ఓటమిని ఒప్పుకుంటూ కన్నీటితో అంగీకరిస్తూ అల్లు అరవింద్ పేరు మీద లక్ష రూపాయల చెక్కు రాసి ఆ ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేశారు సుకుమార్. అంతేకాదు సుకుమార్ ఈ చెక్కును పోస్ట్ చేస్తూ.. “నిన్న అరవింద్ గారి నుండి నాకు ఫోన్ వచ్చింది. ఒక ఇంట్రెస్టింగ్ చాలెంజ్ విసిరారు. ఆకాశంలో ఒక తార సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా బయటకొస్తే కోటి రూపాయలు ఇస్తానన్నారు. లేదంటే నేను లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పారు. ఎంత ఖరీదైన సిఫార్సు సార్ ఇది” అంటూ సుకుమార్ సరదాగా రాసుకు వచ్చారు. మొత్తానికి అయితే ఒకవైపు లక్ష రూపాయల చెక్కు మరొకవైపు సుకుమార్ పెట్టిన సరదా కామెంట్ సినిమాను మరోసారి వార్తల్లో నిలిపేలా చేసింది. మొత్తానికి అయితే అల్లు అరవింద్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇక్కడ భారీగా వర్కౌట్ అయిందని చెప్పాలి. నేషనల్ అవార్డు గ్రహీత సుకుమార్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు అంటే ఈ సినిమాలో బలమైన ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుంది.

 

Related News

యూట్యూబ్‌లో టాప్ 10 ట్రెండింగ్ సౌత్ మాస్ మూవీస్ ఇవే!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘వీడొక్కడే’ మూవీ నటుడు!

ఆటో జానీగా ‘కాకా’.. అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించిన చిరంజీవి!

12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో..

నాని మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడా.. ?

గ్లామర్ డోస్ పెంచేసిన శివానీ నాగరం..ఫొటోషూట్‌లో అదరగొట్టేసిందిగా!

జీవా, శ్రీహరి స్నేహం వెనుక ఇంత కథ ఉందా? బాలచందర్ ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×