E-Paper
Advertisement

సినిమా హిట్ అవ్వకపోతే సుమ యాంకరింగ్.. నేను సినిమాలు మానేస్తా: నాని

సినిమా హిట్ అవ్వకపోతే సుమ యాంకరింగ్.. నేను సినిమాలు మానేస్తా: నాని
Advertisement

Nani-Alias Rukmini: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నాచురల్ స్టార్ నాని(Nani) ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలైన ఈయన ప్రయాణం హీరోగా నిర్మాతగా కూడా సక్సెస్ కొట్టారు. ఇక నాని నిర్మాణంలో ఇదివరకు పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక త్వరలోనే నాని సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అలియాస్ రుక్మిణి (Alias Rukmini) . ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్(Nithin,) అఫియా సయ్యద్ (Afia Sayad )హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు.

సినిమాలను మానేస్తా..

ఈ సినిమా విడుదలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల నిర్వహించిన ఫ్రీ రిలీజ్ వేడుకలో నాని పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాని చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని ఒకవేళ ఈ సినిమా కనుక మీకు నచ్చకపోయి హిట్ కొట్టకపోతే తాను ఇండస్ట్రీ వదిలేస్తానని తెలిపారు.

నిరాశ కలిగించిన ది ప్యారడైజ్…

Advertisement

ఇలా అలియాస్ రుక్మిణి సినిమా హిట్ కాకపోతే నేను సినిమా ఈ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతున్న సుమను ఉద్దేశించి సుమ గారు యాంకరింగ్ కూడా వదిలేస్తారు అంటూ నాని సరదాగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది ప్యారడైజ్ . ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది.

నితిన్ ఇప్పుడైనా హిట్టు కొట్టేనా..

ఈ సినిమా తర్వాత నాని సమర్పణలో అలియాస్ రుక్మిణి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఖచ్చితంగా నానికి సక్సెస్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.. ఇక ఈ సినిమాకు మురళి కాంత్ దర్శకత్వం వహించగా నితిన్ కృష్ణ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల వరుస డిజాస్టర్ సినిమాలను చవిచూస్తున్న నితిన్ ఈ సినిమాతో నైనా సక్సెస్ కొట్టేరా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా ద్వారా బాలీవుడ్ అఫియా సయ్యద్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. డిసెంబర్ 4న నాగచైతన్య సినిమాకు గట్టి పోటీ ఇస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న అలియాస్ రుక్మిణి ఎలాంటి హిట్ కొడుతుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: శోభితను ఎప్పుడైనా అలా పిలిచావా.. నాగార్జున ప్రశ్నకు షాక్ అయిన చైతు!

Related News

సుకుమార్ పై పందెం గెలిచిన అల్లు అరవింద్!

యూట్యూబ్‌లో టాప్ 10 ట్రెండింగ్ సౌత్ మాస్ మూవీస్ ఇవే!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘వీడొక్కడే’ మూవీ నటుడు!

ఆటో జానీగా ‘కాకా’.. అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించిన చిరంజీవి!

12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో..

నాని మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడా.. ?

గ్లామర్ డోస్ పెంచేసిన శివానీ నాగరం..ఫొటోషూట్‌లో అదరగొట్టేసిందిగా!

Big Stories

Advertisement
×