BigTV English

Pawan Kalyan: డైరెక్టర్ వచ్చి నన్ను పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోమన్నారు – యాక్టర్ వెంకట్

Pawan Kalyan: డైరెక్టర్ వచ్చి నన్ను పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోమన్నారు – యాక్టర్ వెంకట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఓజి. ఈ సినిమా అనౌన్స్ చేసిన అప్పటినుంచి విపరీతమైన అంచనాలు ఉన్నాయి. స్వతహాగా సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి.


ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక వీడియో విడుదలైంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వీడియో మంచి జోష్ నింపింది. చాలా ఏళ్లు తర్వాత పవన్ కళ్యాణ్ ని ఒక గ్యాంగ్ స్టార్ గా చూడటం అనేది ఫ్యాన్స్ కు సంతృప్తినించింది. పవన్ కళ్యాణ్ చేస్తున్న అన్ని సినిమాలలో కంటే కూడా ఈ సినిమా మీద విపరీతమైన క్యూరియాసిటీ ఉంది.

పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకున్న 


సుజిత్ ఈ సినిమాలో చాలామంది నటులను ఇన్వాల్వ్ చేశాడు. శ్రీ సీతారాముల కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నటుడుగా పరిచయం అయ్యాడు వెంకట్. వెంకట్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకు వెంకట గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకట్ తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. అయితే ఈ సినిమాలో ఒక సీన్ లో వెంకట్ పవన్ కళ్యాణ్ గారి కాలర్ పట్టుకోవాలి. ఈ విషయం దర్శకుడు చెప్పగానే వెంకట్ కొద్దిసేపు భయపడ్డాడట. అతను డిప్యూటీ సీఎం అతని కాలర్ నేనెలా పట్టుకుంటాను అని సుజిత్ తో తో చెప్పాడు వెంకట్. అయితే సెట్ లోకి పవన్ కళ్యాణ్ రాగానే, వెంకట్ పవన్ కళ్యాణ్ గారితో ఈ విషయాన్ని చెప్పాడు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు అని పిలిచి సీన్ లో కోపరేట్ చేశారట. ఈ విషయాన్ని వెంకట్ (Actor Venkat) రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

సెప్టెంబర్ లో రిలీజ్ 

పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితులను ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. రీసెంట్ గా కూడా డివివి దానయ్య మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఒక పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: Nizam 9 PM Premieres Bookings Update: వీడని ఉత్కంఠ, వీరమల్లుకు పుష్ప పరిస్థితినే తీసుకొస్తారా.?

Related News

Boney Kapoor: నన్ను శ్రీదేవి రూంలోకి రానివ్వలేదు.. ఇన్నాళ్లకు బయపెట్టిన బోనీ కపూర్!

Sreeleela: విజయ్ – రష్మిక లా మారిన శ్రీలీల- కార్తీక్ ఆర్యన్

Madharaasi Collection : 50 కోట్లు కొట్టిన శివకార్తికేయన్.. అయినా బాబుకు నష్టాలే

The Conjuring Collection : 3 రోజుల్లో 1500 కోట్ల కలెక్షన్లు… మెంటల్ మాస్ సినిమారా ఇది..

Ranga Sudha: మాజీ లవర్ పై హీరోయిన్ ఫిర్యాదు.. ప్రైవేట్ వీడియోలు తీసి..

Little Hearts Collection : ‘లిటిల్ హార్ట్స్‌’కి బిగ్ రెస్పాన్స్.. ఫస్ట్ వీకెండ్ సూపర్ కలెక్షన్స్..

Big Stories

×