Ravichandran Ashwin : సాధారణంగా ప్రస్తుతం క్రికెట్ ఎప్పుడూ ఏ ఆటగాడు అద్భుతంగా ఆడుతాడో.. ఏ ఆటగాడు గాయపడుతున్నాడో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఉన్న భారత జట్టు ఆటగాళ్లు రిషబ్ పంత్ చేతి వేలుకు గాయం కారణంగా మూడో టెస్ట్ మ్యాచ్ మధ్యలో కీపింగ్ చేయలేదు. దీంతో సబ్ స్టిట్యూట్ గా ధృవ్ జురెల్ కీపింగ్ చేశాడు. అలాగే ఆల్ రౌండర్ నితీశ్ రెడ్డి, బౌలర్ అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఆకాశ్ దీప్ స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ 4వ టెస్ట్ లో ఆడనున్నాడు. అన్షుల్ కంబోజ్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఈ నేపథ్యంలో అన్షుల్ కంబోజ్ గురించి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read : Maichael Clarke : ఐపీఎల్ లో అత్యంత దరిద్రమైన ప్లేయర్ వీడొక్కడే.. ఆడిన మ్యాచులన్నీ
దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన
యువ ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కంబోజ్ గురించి అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్, ప్రస్తుత బౌలర్ బుమ్రాలతో అన్షుల్ కంబోజ్ ని పోల్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్షుల్ కంబోజ్ హర్యానా కి చెందిన యువ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ జాతీయ దృష్టిని ఆకర్షించాడు. గత రంజీ ట్రోఫీ సీజన్ లో కేరళతో జరిగిన మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి.. రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ గా నిలచాడు. విజయ్ హాజారే ట్రోఫీ 2023-24లో హర్యానా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
అశ్విన్ చెప్పడానికి కారణాలు ఇవేనా..?
జస్‌ప్రీత్ బుమ్రా తన అసాధారణమైన బౌలింగ్ యాక్షన్‌తో బ్యాట్స్‌మెన్‌ను అయోమయానికి గురిచేస్తాడు. అతని విభిన్నమైన యాక్షన్ బంతిని ఊహించలేని విధంగా బౌన్స్ చేయగలదు, వేగాన్ని మార్చగలదు. అన్షుల్ కంబోజ్ బౌలింగ్ యాక్షన్ కూడా కొంత విభిన్నంగా ఉంటుందని, ఇది బ్యాట్స్‌మెన్‌కు అసౌకర్యాన్ని కలిగిస్తుందని అశ్విన్ తెలిపాడు. ఇది బుమ్రాను పోలి ఉంటుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. జహీర్ ఖాన్ తన కెరీర్‌లో కొత్త బంతిని రెండు వైపులా అద్భుతంగా స్వింగ్ చేసి వికెట్లు తీయడంలో దిట్ట. అన్షుల్ కంబోజ్ కూడా బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడని, ముఖ్యంగా ఇంగ్లాండ్ వంటి పరిస్థితుల్లో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుందని అశ్విన్ భావించి ఉండవచ్చు. ఇది జహీర్ ఖాన్ బౌలింగ్ శైలిని గుర్తుచేస్తుందని అశ్విన్ భావించినట్లు తెలుస్తోంది. బుమ్రా డెత్ ఓవర్లలో యార్కర్లు, వేగ మార్పులతో వికెట్లు తీయడంలో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరుగాంచాడు. అన్షుల్ కంబోజ్ దేశవాళీ క్రికెట్‌లో క్లిష్ట సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. ఇది బుమ్రాలోని లక్షణాన్ని అన్షుల్‌లో అశ్విన్ గుర్తించాడు.