Nizam 9 PM Premieres Bookings Update: పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న విడుదలకు సిద్ధమవుతుంది. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా విషయంలో యాక్టివ్ గా ఉండడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ సినిమా పూర్తయిన కూడా ఒక పరిస్థితిలో డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి కూడా ముందుకు రాలేదు. చివరి వరకు ఆ ఉత్కంఠ నిలిచింది.
ఇక నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను డిస్టిబ్యూషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సినిమా విషయంలో ప్రీమియర్ షో సమస్యలు ఎదురవుతున్నాయి. వారిద్దరి మధ్య ఇప్పటికి వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. పక్క టైం అయిపోతున్న కూడా టికెట్లు పెట్టకపోవడంతో ఫ్యాన్స్ అందరూ అసహనంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు ఎందుకిలా జరుగుతుంది అని చాలామంది తమ ఉద్దేశం వ్యక్తం చేస్తున్నారు.
వీడని ఉత్కంఠ…
అసలు హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఏం జరుగుతుందంటే, ఎక్కువ రేట్లు తెచ్చాం కాబట్టి డిస్ట్రిబ్యూటర్ కు రెగ్యులర్ గా ఇచ్చే కంటే ఎక్కువ Share ఇవ్వాలని మైత్రీ , ఇప్పటి ఫార్ములాతో అయితే పెంచిన రేట్ల వల్ల మల్టిప్లెక్స్ లకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 కు కూడా ఇదే వివాదం వచ్చినప్పుడు మల్టీప్లెక్స్ లలో ప్రీమియర్ వెయ్యలేదు మైత్రి మూవీ మేకర్స్. అయితే ఇప్పుడు మల్టీప్లెక్స్ లో హరిహర వీరమల్లకి కూడా అదే జరుగుతుందేమో అని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సినిమాపై భారీ అంచనాలు
ఈ సినిమా పూర్తయిన తర్వాత నిర్మాత ఏం రత్నం విపరీతంగా ఈ సినిమాను ప్రమోట్ చేశారు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఈ సినిమాపై తన నమ్మకాన్ని తెలియజేశారు. సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో తెలిపారు. అయితే కేవలం నిర్మాత ఏం రత్నం మాత్రమే కాకుండా, నిధి అగర్వాల్ కూడా విపరీతంగా ఈ సినిమా గురించి కష్టపడ్డారు. ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. వీరిద్దరు కష్టాన్ని చూసి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఒక్కసారిగా సినిమా మీద విపరీతమైన బజ్ వచ్చేసింది. గతంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమా గురించి ఇంతలా ప్రమోషన్ చేయలేదు. అందుకోసమే ఫ్యాన్స్ లో కూడా విపరీతమైన క్యూరియాసిటీ మొదలైంది.
Also Read: Hari Hara VeeraMallu : మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇదేదో తేడాగా ఉంది గురు