HHVM 2: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ప్రస్తుతం హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇన్ని రోజులపాటు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా వరుస ప్రెస్ మీట్ కార్యక్రమాలు వరుస ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా సినిమాకు కావలసినంత బజ్ క్రియేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుగానే సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక నేడు పవన్ కళ్యాణ్ వరుసగా మీడియాతో ఇంటరాక్ట్ అవడం అలాగే ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడారు.
నాలుగున్నర గంటల నిడివి..
జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో ఏఎం రత్నం(A.M. Ratnam) నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. హిస్టారికల్ పీరియాడిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేసింది. ఈ సినిమా జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా క్రిష్ తన వద్దకు తీసుకు వచ్చినప్పుడు దాదాపు నాలుగున్నర గంటల పాటు నిడివి ఉందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
వీర మల్లు పార్ట్ 2 ఉంటుందా?
ఇలా ఈ సినిమా నిడివి ఈ స్థాయిలో ఉన్న నేపథ్యంలోనే ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు. మొదటి భాగం షూటింగ్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలలో నటించడానికి సమయం కుదరడం లేదు ఇలాంటి తరుణంలోనే ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉండబోతుంది మరి ఆ సినిమా పరిస్థితి ఏంటి? అనే సందేహం అందరిలోనూ ఉంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సీక్వెల్ సినిమాపై క్లారిటీ ఇచ్చారు.
భగవంతుడి ఆశీస్సులు ఉండాలి..
హరిహర వీరమల్లు పార్ట్ 2 (HHVM Part 2)ఇప్పటికే దాదాపు 20 నుంచి 30% షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని తెలియజేశారు. ఈ సినిమాకు ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి, తనకు సమయం కుదిరితేనే పార్ట్ 2 షూటింగ్ పనులు జరుపుకుంటామని పవన్ తెలియజేశారు. అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా కావాలి అంటూ పవన్ కళ్యాణ్ పార్ట్ 2 పై చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకుంటే కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం దాదాపు కష్టమేనని తెలుస్తోంది. ఈయన పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాలలో బిజీ కాబోతున్నారు అయితే హీరోగా సినిమాలు చేయకపోయినా నిర్మాతగా సినిమాలు చేస్తానంటూ ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియచేశారు.
Also Read: Nithya Menen: పెళ్లయితే మంచిది… కాకపోతే మరీ మంచిది.. పెళ్లిపై ఓపెన్ అయిన నిత్య మీనన్!