E-Paper
Advertisement

52 ఏళ్లలో కూడా తరగని అందం .. ఫిట్నెస్ సీక్రెట్ అదే అంటున్న సీనియర్ హీరోయిన్!

52 ఏళ్లలో కూడా తరగని అందం .. ఫిట్నెస్ సీక్రెట్ అదే అంటున్న సీనియర్ హీరోయిన్!
Advertisement

Aamani: సాధారణ మనుషులతో పోల్చుకుంటే సినీ సెలబ్రిటీలు ఎంత యంగ్ గా , అందంగా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వృద్ధాప్య వయసు చేరువ అవుతున్నప్పటికీ కూడా వారు ఇంకా 30 , 40 సంవత్సరాల వయసున్న వారిలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అయితే ఈ అందం వెనుక సంవత్సరాల తరబడి కఠోర శ్రమ ఆహార నియమాలు ఉన్నాయంటున్నారు సెలబ్రిటీలు. ఇదిలా ఉండగా ఇప్పుడు 52 సంవత్సరాల వయసులో కూడా చెరగని అందం, అభినయంతో చలాకీ తనంతో అందరినీ ఆకట్టుకుంటుంది ఆమని. అయితే ఈ అందం వెనుక అసలు కారణం ఏంటో కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

ఆమని ఫిట్నెస్ సీక్రెట్..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని మాట్లాడుతూ.. “క్రమశిక్షణతో కూడిన జీవనశైలే నా యవ్వనానికి ప్రధాన కారణం. ఉదయం నాలుగు గంటలకే నిద్రలేస్తాను. నిత్య పూజలు, యోగా, సమతుల ఆహారం నా ఆరోగ్య రహస్యాలు. ఈవీవీ వంటి దర్శకుల మార్గదర్శకత్వం కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ.. వృత్తిలో కూడా నేను విలువలతో కూడిన సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాను. బాల్యం నుంచే ఆరోగ్య సంరక్షణ పట్ల నాకు ఆసక్తి ఉంది. అందుకే ఇది చిన్నప్పటి నుంచే అలవాటయింది. కాబట్టి ఇప్పటికీ ఆ అలవాటు అలాగే కొనసాగుతోంది అంటూ తెలిపింది ఆమని.

ఆమని ఆహారపు అలవాట్లు..

Advertisement

అలాగే తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ.. “నేను అన్ని రకాల ఆహారాలను తింటాను. అయితే తక్కువ పరిమాణంలోనే తీసుకుంటాను. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటివి మిస్ చేయను. కానీ పరిమాణాన్ని మాత్రమే తగ్గిస్తాను. అయితే నేను మాంసాహారం వండడంలో నిపుణురాలని .. బిర్యానీ వంటి వాటిని చాలా అద్భుతంగా వండుతాను కూడా. చిన్నప్పటి నుంచి నాకు మాంసాహారం అంటే ఇష్టం ఉండదు. నేను ఒక విశ్వబ్రాహ్మిని కావడంతో మా కుటుంబంలో కూడా ఎవరు మాంసం తినరు. కానీ పిల్లలు మాత్రం మాంసాహారం తింటారు అందుకే వారి కోసం వండి పెడతాను అంటూ తెలిపింది ఆమని.

ఆమని భక్తి మార్గం..

అలాగే తనకున్న దైవభక్తి గురించి కూడా మాట్లాడుతూ.. ఉదయం 4 గంటలకే నా రోజు ప్రారంభం అవుతుంది. నిద్ర లేవగానే స్నానం చేసి దేవుడి పూజకి సిద్ధమవుతాను. రోజును బట్టి మంగళవారం లలిత సహస్రనామం, శనివారం విష్ణు సహస్రనామం చెప్పుకోవడం అలవాటు. కనీసం అష్టోత్తరమైనా చెప్పుకుంటాను. దీపం పెట్టకుండా బయటకు వెళ్ళను. ఆధ్యాత్మికత నా జీవితంలో ఒక బలహీనత. దేవుని పట్ల భక్తి నన్ను ముందుకు నడిపిస్తోంది అంటూ తెలిపింది ఆమని. మొత్తానికైతే ఆమని చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ:ముసుగులో మోసాలెన్నో.. నోరు తెరిస్తే కాపురాలు కూలుతాయి.. గీతా మాధురి షాకింగ్ కామెంట్స్!

ఆమని కెరియర్..

ఆమని కెరియర్ విషయానికి వస్తే.. 1992లో నరేష్ హీరోగా వచ్చిన జంబ లకిడి పంబ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈమె.. ఈ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసింది . ఆ తర్వాత మిస్టర్ పెళ్ళాం సినిమా చేసి ఈ రెండు చిత్రాలకు రెండు నంది అవార్డులు ,ఒక ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఈమె ఇప్పటికీ బుల్లితెర షోలలో, సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తోంది.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×