Tollywood:ప్రముఖ లేడీస్ సింగర్ గీతామాధురి (Geetha Madhuri) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన స్వరంతో శ్రోతలను అలరించే ఈమె ఎన్నో అద్భుతమైన పాటలు పాడి అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రముఖ హీరో నందు భార్యగా అటు టీవీ షోలలో కూడా సందడి చేస్తూ మరింత పాపులారిటీ అందుకున్న ఈమె.. ఒక పక్క తల్లిగా, భార్యగా ఫ్యామిలీ బాధ్యతలు నెరవేరుస్తూ మరొకవైపు సింగర్ గా టీవీ షోలతో కూడా బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న గీతామాధురి కాస్త సమయం దొరికింది అంటే చాలు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం తన సమయాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిందని చెప్పాలి. అసలు విషయంలోకి వెళితే ప్రముఖ సింగర్ నోయెల్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఎన్నో విషయాలు పంచుకున్న ఈమె.. ఒక ఆసక్తికర విషయం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా నోయల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా.. అందులో గీతామాధురి మాట్లాడుతూ.. “సాధారణంగా నేను రెగ్యులర్ గా బయటికి వెళ్ళను. కానీ ఎప్పుడో ఒకసారి కాఫీ షాప్ కి వెళ్తే ఆ రోజే ఏదో ఒక ప్రేమ జంట అదే కాఫీ షాప్ కి వచ్చి నాకు దొరికిపోతారు. ముఖ్యంగా నేను వెళ్ళిన రోజే ఎవరో ఒకరు వచ్చి నా కంటికి చిక్కుతారు. అలా నాకు చాలామంది దొరికిపోయారు. నేను వెళ్లేదే ఎప్పుడో ఒకసారి అంటే ఆ వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక జంట కనిపిస్తూనే ఉంటుంది. అందుకే వారి గురించి ఇప్పుడు నేను నోరు తెరిస్తే మాత్రం వారి కాపురాలు కూలిపోతాయి..” అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది గీతామాధురి. ఇకపోతే కాపురాలు కూలిపోయే రేంజిలో గీతామాధురి ముందు కనిపించిన ఆ ప్రేమ జంటలు ఎవరు? టాలీవుడ్ వారా? లేక బుల్లితెర ? లేదా తెలిసిన వారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీని గురించి గీతామాధురి ఇంకేదైనా చెప్పిందా అనే విషయం తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇకపోతే గీతామాధురి మాటలు విన్న కొంతమంది నెటిజన్స్ ముసుగులో తెలియని మోసాలెన్నో చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ALSO READ:స్టోరేజ్ వార్స్ నటుడు ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?
గీతా మాధురి విషయానికి వస్తే.. 1985 ఆగస్టు 24న ప్రభాకర్, లక్ష్మి లకు జన్మించిన ఏకైక సంతానం. ఈమె తండ్రి ప్రభాకర్ ఎస్బిహెచ్ బ్యాంకులో పనిచేస్తున్నారు. గోదావరి ప్రాంతానికి చెందినవారు. కానీ గీతామాధురి చిన్న వయసులోనే కుటుంబం హైదరాబాదుకి మారిపోయారు. ప్రాథమిక విద్య హైదరాబాద్, వనస్థలిపురంలోనూ లయోలా పాఠశాలలో పూర్తయింది. చిన్నప్పటినుంచి సంగీతం మీద మక్కువ పెంచుకున్న ఈమె లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో కొచ్చర్లకోట పద్మావతి, రామాచార్ల వద్ద శాస్త్రీయ, సినీ , లలిత సంగీతాలలో శిక్షణ పొందింది.. సినిమా పాటలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె 2014లో ప్రముఖ నటుడు నందుని వివాహం చేసుకుంది.. వీరికి ఒక కూతురు , కొడుకు కూడా ఉన్నారు. ఇకపోతే నందు 100% లవ్ సినిమాలో అజిత్ గా ప్రాచుర్యం పొందాడు. పైగా వీరిద్దరూ కలిసి అతిధి అనే ఒక షార్ట్ ఫిలిం లో కూడా హీరో హీరోయిన్గా నటించారు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.