BigTV English

Honey Rose : హనీ రోజ్ నువ్వెక్కడ..? సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా..?

Honey Rose : హనీ రోజ్ నువ్వెక్కడ..? సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా..?

Honey Rose : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు హనీ రోజ్.. ఈ ముద్దుగుమ్మ బాలయ్య సరసన జతకట్టి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. హాట్ అందాలతో కుర్ర కారు మతిపోగొట్టేలా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ బిజీగా ఉండేది. అయితే ఈమె ఈమధ్య ఒకే ఒక సినిమాతో సరిపెట్టుకుంది. ఒకవైపు వరుసగా అవకాశాలు ఆమె తలుపు తడుతున్న సరే సినిమాలకు మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. కేవలం షాపింగ్ మాల్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. హనీ పాప ఇక సినిమాలో చెయ్యదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడేమో అసలు సినిమాలే చేయదంటూ మరో వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే హనీ రోజ్ సినిమాలు కు గుడ్ బై చెప్పేస్తుందా? వేరే ఇతర కారణాలతో సినిమాలు చేయడం లేదా? అసలు ఆమె ఏమంటుంది ఒకసారి తెలుసుకుందాం..


బాలయ్య సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ..

నందమూరి హీరో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది హనీ రోజ్. ఈ సినిమాతో ఆమె ఒక్కసారిగా యూత్ క్రష్ గా మారిపోయింది. ఆమె కోసం గూగుల్ లో నెటిజెన్లు తెగ వెతికేశారు. గతంలో ఈమె హీరో శివాజీ సరసన ఆలయం సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా అంతగా గుర్తింపును తీసుకురాలేదు. బాలయ్య సరసన జోడి కట్టిన ఈ సినిమా మాత్రమే అమ్మడు రేంజ్ ని ఓ రేంజ్కి తీసుకెళ్లింది. ఈమె క్రేజ్ ను చూసి వరుసగా సినిమాలు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. దీనిపై ఇప్పటికే ఇండస్ట్రీలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హాని రోజు మాత్రం దీనిపై ఎక్కడ స్పందించలేదు. త్వరలోనే క్లారిటీ ఇస్తే బాగుండునని ఆమె అభిమానుల సైతం సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. మరి దీనిపై హనీ పాప రియాక్ట్ అవుతుందేమో చూడాలి..


సినిమాలకు హాని రోజ్ గుడ్ బై..?

ముద్దుగుమ్మ హనీరోజ్ తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక్క సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ తర్వాత ఈమె సినిమాలు చేయలేదు కానీ.. షాపింగ్ మాల్ ఓపెనింగ్ లతో బిజీగా గడుపుతుంది. మొన్నటి వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో అభిమానులకు టచ్ లో ఉండేది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా ఉన్నట్లు కనిపించడం లేదు. ఏవో షాపింగ్ మాల్ వీడియోలను పోస్ట్ చేస్తుంది.. అయితే ఈమె సడన్గా ఎందుకు ఇలా సైలెంట్ గా ఉంది అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. మరి దీనిపై ఈ బ్యూటీ రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..

Related News

Anasuya Bharadwaj : అనసూయ మళ్లీ దొరికిందిరోయ్..వీడియో హల్ చల్..

OG Movie : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ హిందీలో శాటిలైట్ రైట్స్‌కు క్రేజీ ఆఫర్.. హిట్ పక్కా..!

War 2 – Ntr: ఎన్టీఆర్ కి ఘోర అవమానం, ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు

Rajinikanth: ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? రజనీ ను చూసి నేర్చుకోండి – సజ్జనర్

Actor Suman: ఆయన దయతోనే రాజకీయాలలోకి వస్తా.. క్లారిటీ ఇచ్చిన సుమన్!

Big Stories

×