BigTV English

OTT Movie : అనాథ పిల్లలే టార్గెట్… పర్ఫ్యూమ్ స్మెల్ తో కిడ్నాప్ కేసులో మలుపు… ట్విస్టులతో పిచ్చెక్కించే తమిళ క్రైమ్ డ్రామా

OTT Movie : అనాథ పిల్లలే టార్గెట్… పర్ఫ్యూమ్ స్మెల్ తో కిడ్నాప్ కేసులో మలుపు… ట్విస్టులతో పిచ్చెక్కించే తమిళ క్రైమ్ డ్రామా

OTT Movie : యాక్షన్ సీక్వెన్స్‌లను ఇష్టపడే వాళ్లకు ఒక ఎమోషనల్ పోలీస్ స్టోరీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తమిళ స్టోరీ చిన్నపిల్లల మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో తండ్రి-కొడుకులుగా నటించిన అథర్వా, అరుణ్ పాండియన్ నటనలకు ప్రశంసలు వచ్చాయి. యాక్షన్, సస్పెన్స్ తో ఈ సినిమా స్పైన్ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఆహాలో స్ట్రీమింగ్

‘ట్రిగ్గర్’ (Trigger) ఒక తమిళ అండర్‌కవర్ కాప్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. సామ్ ఆంటన్ డైరెక్షన్‌లో, అథర్వా (ప్రభాకరన్) తాన్యా రవిచంద్రన్ (జనని), రాహుల్ దేవ్ శెట్టి (మైఖేల్), అరుణ్ పాండియన్ (సత్యమూర్తి) ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈసినిమా 2022 సెప్టెంబర్ 23న థియేటర్లలో రిలీజ్ అయింది. 2022 అక్టోబర్ 14 నుంచి Ahaలో తమిళం, తెలుగు ఆడియోతో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా, సస్పెన్స్, ఎమోషనల్ కనెక్షన్‌తో ఆకట్టుకుంటుంది. IMDbలో దీనికి 5.9/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళ్తే

ప్రభాకరన్ ఒక డైనమిక్ కాప్. ఒక ఇన్ఫార్మర్‌ని రక్షించినందుకు సస్పెండ్ అవుతాడు. ఆతరువాత తమిళనాడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్నల్ అఫైర్స్‌లో అండర్‌కవర్ టీమ్‌లో చేరతాడు. అతని టీమ్లో చిన్ని జయంత్, మునీష్‌కాంత్, ఇతర సస్పెండెడ్ కాప్‌లు ఉంటారు. ఒక రెస్టారెంట్‌లో బేస్ ఏర్పాటు చేసి, కరప్టెడ్ పోలీసులను గమనిస్తుంటారు. ఇదిలా ఉండగా, ప్రభా అన్నయ్య కార్తి, అతని భార్య బావ శ్రీ ఒక అనాథాశ్రమం నుంచి నీషా అనే అనాథ బాలికని దత్తత తీసుకోవాలనుకుంటారు. కానీ నీషాను దత్తత తీసుకునే రోజున తను కిడ్నాప్ అవుతుంది. ప్రభా ఆ కిడ్నాపర్ ఆదిని ఓ వేర్‌హౌస్‌లో పట్టుకొని నీషాని రక్షిస్తాడు. దెబ్బలు తిన్న ఆదిని ఆస్పత్రిలో చేర్చి, అతని లీడర్ మైఖేల్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ మైఖేల్ ఆదిని చంపేస్తాడు.

ప్రభా కేసును డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. 1993లో కమిషనర్ ఆఫీస్‌పై దాడి చేసిన ఘటనకు, ఆల్జ్‌హైమర్స్‌తో బాధపడుతున్న తన తండ్రి సత్యమూర్తి విషయానికి మైఖేల్ తో సంబంధం ఉందని తెలుస్తుంది. మైఖేల్ అనాథాశ్రమాల నుంచి పిల్లలను దత్తత పేరుతో తీసుకొని, మూడేళ్ల తర్వాత వాళ్లను హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం అమ్ముతుంటాడు. సత్యమూర్తి దీనిపై ఆధారాలు సేకరించి, కమిషనర్ ఆఫీస్‌లో ఇవ్వబోతుండగా, మైఖేల్ దాడిలో సత్యమూర్తి తలకి గాయమై, మెమరీ కోల్పోతాడు. ఇప్పుడు మైఖేల్ 20 మంది పిల్లలను కిడ్నాప్ చేసి, డబ్బు డిమాండ్ చేస్తాడు. సత్యమూర్తి తన మెమరీలను కొంత గుర్తుచేసుకొని, మైఖేల్‌ని చంపి, నీషాని, ఇతర పిల్లలను రక్షిస్తాడు. ఈ కథ ఇలా ఎండ్ అవుతుంది.

Read Also : బుర్ర తక్కువ వాడితో యవ్వారం…ఐఎండీబీలో 8.3 రేటింగ్… పిచ్చెక్కించే ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : మెంటల్ హాస్పిటల్లో పేషంట్స్ మిస్సింగ్… మెంటలెక్కించే ట్విస్టులు… కిర్రాక్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఆంటీతో అరాచకం… చిన్న పిల్లాడితో ఇవేం పనులురా అయ్యా… రాత్రిపూట ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : నలుగురమ్మాయిల రచ్చ… ఇద్దరబ్బాయిల ఎంట్రీతో ట్విస్ట్… అన్నీ అవే పాడు సీన్లు సామీ

OTT Movie : ర్యాబిట్ సూట్ లో వింత మనిషి జోస్యం… నిద్రలో నడిచే అలవాటున్న హీరోకి ఊహించని షాక్… వణికించే హర్రర్ సీన్స్

OTT Movie : వామ్మో… మనుషుల్ని చంపి మటన్ లా తినే భార్యాభర్తలు… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×