BigTV English

OTT Movie : ర్యాబిట్ సూట్ లో వింత మనిషి జోస్యం… నిద్రలో నడిచే అలవాటున్న హీరోకి ఊహించని షాక్… వణికించే హర్రర్ సీన్స్

OTT Movie : ర్యాబిట్ సూట్ లో వింత మనిషి జోస్యం… నిద్రలో నడిచే అలవాటున్న హీరోకి ఊహించని షాక్… వణికించే హర్రర్ సీన్స్

OTT Movie : టైమ్ ట్రావెల్ థీమ్ తో నడిచే స్టోరీలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మరో ప్రపంచంలోకి ఖచ్చితంగా తీసుకెళ్లాయి. ఇలాంటి సినిమాలు ఓటీటీలో చాలానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక టీనేజర్ వింత విజన్స్, టైమ్ ట్రావెల్, అపోకలిప్టిక్ ఈవెంట్స్‌తో నడుస్తుంది. ఇది సైకలాజికల్ డెప్త్, ఫిలాసఫికల్ థీమ్స్‌తో కల్ట్ స్టేటస్ సంపాదించింది. ఈ సినిమా 2001 లో సాటర్న్ అవార్డ్స్ లో Best Science Fiction Film, 2002 ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్ లో Best First Screenplay నామినేషన్స్ పొందింది. ఈ సినిమా స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


స్టోరీలోకి వెళ్తే

డానీ డార్కో అనే టీనేజర్1988లో వర్జీనియాలోని నివసిస్తుంటారు. ఒక మానసిక జబ్బుతో బాధపడుతూ, వింత విజన్స్‌తో సతమతమవుతుంటాడు. ఒక రాత్రి భయంకరమైన కుందేలు మాస్క్‌లో ఫ్రాంక్ అనే ఒక ఫిగర్ అతనికి కనిపిస్తాడు. 28 రోజుల 6 గంటల 42 నిమిషాల 12 సెకన్లలో ప్రపంచం అంతం అవుతుందని చెప్తాడు. అదే రాత్రి, ఒక జెట్ విమానం డానీ ఇంటిపై కూలుతుంది. కానీ ఫ్రాంక్ వల్ల అతను బయటపడతాడు. డానీ ఈ విజన్స్, టైమ్ ట్రావెల్ గురించి ఆలోచిస్తూ, తన స్కూల్‌లో గ్రెచెన్ రాస్ తో ఫ్రెండ్‌షిప్, ప్రేమను పెంచుకుంటాడు. అతని ఇంగ్లీష్ టీచర్ కరెన్, సైన్స్ టీచర్ డాక్టర్ మోనిటాఫ్ టైమ్ ట్రావెల్, ఫిలాసఫీ గురించి జరిపే చర్చలు డానీకి సూచనలిస్తాయి. డానీ తన సిస్టర్ ఎలిజబెత్, తల్లిదండ్రులతో ఉంటూ, ఫ్రాంక్ విజన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు.డానీ ఫ్రాంక్ సూచనలతో స్కూల్‌లో పైపులు పగలగొట్టడం, జిమ్ కన్నింగ్‌హామ్ అనే మోటివేషనల్ స్పీకర్‌పై అనుమానించడం వంటి చర్యలకు పాల్పడతాడు. అయితే ఈ సమయంలో గ్రెచెన్‌తో డానీ బంధం బలపడుతుంది.


కానీ ఫ్రాంక్ అతన్ని మనం ఒక టాంజెంట్ యూనివర్స్‌లో ఉన్నామని. అది 28 రోజుల్లో కూలిపోతుందని చెప్తాడు. డానీ ఒక పాత పుస్తకం, ది ఫిలాసఫీ ఆఫ్ టైమ్ ట్రావెల్ ద్వారా, తను లివింగ్ రిసీవర్‌గా, టాంజెంట్ యూనివర్స్‌ని సరిచేయాలని తెలుసుకుంటాడు. క్లైమాక్స్‌లో, హాలోవీన్ పార్టీలో గ్రెచెన్ ఒక యాక్సిడెంట్‌లో చనిపోతుంది. డానీ తన ఇంటికి వెళ్లి, టైమ్ లూప్‌ని సరిచేయడానికి, జెట్ ఇంజిన్ కూలే సమయంలో తన గదిలో ఉంటాడు. తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. టాంజెంట్ యూనివర్స్ రీసెట్ అవుతుంది. గ్రెచెన్, ఇతరులు బతుకుతారు, కానీ డానీ చనిపోతాడు. ఈ కథ డానీ సైకలాజికల్ జర్నీ, టైమ్ ట్రావెల్, డెస్టినీ గురించి ఎమోషనల్‌గా, సస్పెన్స్‌తో ఆలోచింపజేస్తుంది.

ఏ ఓటీటీలో ఉందంటే

‘డానీ డార్కో’ (Donnie Darko) ఒక అమెరికన్ సైకలాజికల్ సై-ఫై థ్రిల్లర్. రిచర్డ్ కెల్లీ డైరెక్షన్‌లో, జెన్నా మలోన్ (గ్రెచెన్ రాస్), మాగీ గైలెన్‌హాల్ (ఎలిజబెత్ డార్కో), డ్రూ బ్యారీమోర్ (కరెన్ పోమరాయ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 53 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDb లో 8.0/10 రేటింగ్ ను పొందింది. ఈ సినిమా 2001 అక్టోబర్ 26న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం Amazon Prime Video, Hulu, Arrow Playerలో ఇంగ్లీష్ ఆడియోతో, హిందీ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : పెళ్ళైన నెలకే భర్త మృతి… అర్ధరాత్రి అలాంటి అమ్మాయి ఇంటికి అనామకుడు… ఫీల్ గుడ్ తమిళ మూవీ

Related News

OTT Movie : మెంటల్ హాస్పిటల్లో పేషంట్స్ మిస్సింగ్… మెంటలెక్కించే ట్విస్టులు… కిర్రాక్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఆంటీతో అరాచకం… చిన్న పిల్లాడితో ఇవేం పనులురా అయ్యా… రాత్రిపూట ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : నలుగురమ్మాయిల రచ్చ… ఇద్దరబ్బాయిల ఎంట్రీతో ట్విస్ట్… అన్నీ అవే పాడు సీన్లు సామీ

OTT Movie : అనాథ పిల్లలే టార్గెట్… పర్ఫ్యూమ్ స్మెల్ తో కిడ్నాప్ కేసులో మలుపు… ట్విస్టులతో పిచ్చెక్కించే తమిళ క్రైమ్ డ్రామా

OTT Movie : వామ్మో… మనుషుల్ని చంపి మటన్ లా తినే భార్యాభర్తలు… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×