BigTV English

Kalpika: నటి కల్పిక అరెస్టుపై కోర్టు కీలక ఆదేశాలు.. నెక్ట్స్ ఏమిటీ?

Kalpika: నటి కల్పిక అరెస్టుపై కోర్టు కీలక ఆదేశాలు.. నెక్ట్స్ ఏమిటీ?

Kalpika: కల్పిక (Kalpika)పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె సినిమాలలో నటిస్తూ సంపాదించుకున్న గుర్తింపు కంటే వివాదాల ద్వారానే పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కల్పిక ఇటీవల ఓ రిసార్ట్ లో పెద్ద ఎత్తున హంగామా చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇలా ఎక్కడికి వెళ్లినా వివాదాలతో వార్తల్లో నిలిచే ఈమె పై ఇప్పటికే కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుల విషయంలో నటి కల్పికకు కాస్త ఉపశమనం లభించిందని చెప్పాలి. కల్పికపై పలు కేసులో నమోదు కావడంతో ఏ క్షణమైన ఈమెను అరెస్టు చేయవచ్చని అందరూ భావిస్తున్న తరుణంలో తనని అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court) పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది.


ప్రిజం పబ్ యాజమాన్యం…

ఇలా కల్పిక కేసు విషయంలో ఆమెను అరెస్ట్ చేయొద్దని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి అంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇక కల్పిక పైన మొదలైన కేసులు ఏంటి అనే విషయానికి వస్తే.. 2025 మే 29వ తేదీ ఈమె హైదరాబాద్ లోనే ప్రిజం పబ్(Prism pub) కు వెళ్లగా అక్కడ పబ్ యాజమాన్యంతో పెద్ద ఎత్తున గొడవకు దిగారు. ఇలా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఈ వివాదం కాస్త పోలీసుల వరకు వెళ్లడంతో నటి కల్పికపై కేసు పెట్టడం జరిగింది.


సైబర్ క్రైమ్ పై తప్పుడు ప్రచారం…

పబ్ కు వెళ్లిన ఈమె బిల్ పే చేయకుండా అక్కడ సిబ్బందితో దురుసుగా మాట్లాడటమే కాకుండా పబ్ లో ఉన్నటువంటి వస్తువులను విసిరి కొట్టడం యాజమాన్యంపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ వారిపై బూతులు తిట్టడం వంటివి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇలా ఈమె గొడవ పడటంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ప్రిజమ్ పబ్ యాజమాన్యం కేసు నమోదు చేసింది. అదేవిధంగా సైబర్ క్రైమ్(Cyber Crime) పోలీసులు కూడా ఈమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ పట్ల కల్పిక తప్పుడు ప్రచారాలను చేస్తున్నారంటూ ఈమెపై కేసు నమోదు చేశారు.

అరెస్టు వద్దు..

ఇలా ఈమె పట్ల ఈ రెండు కేసులో నమోదు కావడంతో ఈ విషయంలో కోర్ట్ కల్పికకు అనుకూలంగా ఉత్తర్వులను జారీ చేయడం విశేషం. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈమెను అరెస్టు చేయకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇలా నిత్యం వివాదాలలో నిలుస్తున్న కల్పిక ఇటీవల ఒక రిసార్ట్ లో కూడా రిసార్ట్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కడికి వెళ్లిన ఈమె గొడవలు పడుతున్న నేపథ్యంలో కేవలం అటెన్షన్ కోసమే ఇలా చేస్తున్నానని, ఓ సందర్భంలో చెప్పకనే చెప్పారు. అయితే ఈమె గతంలో కూడా ఇలాంటి వివాదాలలో చిక్కుకొని వార్తలో నిలిచారు. ఇక ఈమె మహేష్ బాబు సమంత హీరో హీరోయిన్లుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్న కల్పిక తరచూ వివాదాలలో నిలుస్తున్నారు.

Also Read: O Bhama Ayyo Rama OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన ఓ భామ అయ్యో రామ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×