O Bhama Ayyo Rama OTT: ఇటీవల కాలంలో ప్రతివారం ఎన్నో కొత్త సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుండగా మరికొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఒక సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకే తిరిగి ఓటీటీలో ప్రసారమవుతున్నాయి. త్వరలోనే మరో కొత్త సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. సుహాస్(Suhas) హీరోగా నటించిన సినిమాలు ఇటీవల వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈయన నటించిన ఓ భామ అయ్యో రామ ( O Bhama Ayyo Rama)సినిమా జూలై 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆగస్టు 1వతేదీ విడుదల…
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమాలో సుహాస్ కు జోడిగా మలయాళ నటి మాళవిక మనోజ్(Malavika Manoj) తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి రామ్ గోధల దర్శకత్వం వహించగా, వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మించారు. ఇలా జూలై 11వ తేదీ థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా తిరిగి అతి తక్కువ రోజులలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఆగస్టు 1 వతేదీ నుంచి ఈటీవీ విన్(Etv Win) ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్…
ఈ సినిమా హక్కులను ఈటీవీ విన్ కైవసం చేసుకున్న నేపథ్యంలో సినిమా విడుదలైన 20 రోజులకే ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది.ఇక థియేటర్లో ఈ రొమాంటిక్ కామెడీని చూడటం మిస్ అయినవారు ఈటీవీ విన్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే… ఈ సినిమాలో సుహాస్ (రామ్) తన తల్లి(అనిత) నృత్య కారిణిగా కనిపిస్తారు. చిన్నప్పుడే తన భర్త చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక తన కొడుకును తీసుకొని ఆమె ఇల్లు వదిలి బయటకు వచ్చేస్తుంది. అయితే కొద్ది రోజులకే అనిత కూడా చనిపోతుంది. ఆమె చనిపోవడంతో రామ్ ను చేరదీసి అతనిని పెంచి పెద్ద చేస్తారు. తన మేనమామ(అలీ).
She brought back his lost dreams… but also his deepest wounds.🎬#OhBhamaAyyoRama Premieres Aug 1💥💥💥
On @etvwin@ActorSuhas #MalavikaManoj @anitahasnandani @NenuMeeRamm @radhanmusic @HarishNallaOffl @maniDop pic.twitter.com/x9ndUmmv96— ETV Win (@etvwin) July 31, 2025
ఇలా ఒకరోజు అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా రామ్ కు సత్యభామ (మాళవిక మనోజ్) పరిచయమవుతుంది. తాగిన మత్తులో ఉన్న సత్యభామను రామ్ జాగ్రత్తగా తన ఇంటి దగ్గర దిగ పెడతారు అయితే ఇతని మంచితనం నచ్చిన సత్యభామ అతనితో ప్రేమలో పడుతుంది. సత్య రామ్ జీవితంలోకి వచ్చిన తర్వాత తన జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. సినిమాలు అంటేనే ఇష్టం లేని సత్యభామ రామ్ ను ఒక దర్శకుడి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎందుకు పెట్టారు? చివరికి సత్య భామ రామ్ ప్రేమ కథ ఏమైంది? సినిమా ఇండస్ట్రీలో రామ్ సక్సెస్ అయ్యారా? లేదా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఇలా థియేటర్లలో ప్రదర్శతమవుతూ పరవాలేదు అనిపించుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ వస్తుంది, ఇక్కడ ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.