Fruits For Glowing Skin: ముఖం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఫేస్ క్రీములు వాడుతుంటే.. మరికొందరు హోం రెమెడీస్ ట్రై చేస్తుంటారు. అయినప్పటికీ కొన్ని సార్లు ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలోనే కొన్ని రకాల ఫ్రూట్స్ తినడం మంచిది. నేచురల్‌గా ముఖం మెరిసిపోవడానికి ఫ్రూట్ డైల్ లో భాగంగా చేసుకోవడం మంచిది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిమ్మకాయలు , నారింజ (సిట్రస్ పండ్లు):
సిట్రస్ పండ్లు అయిన నిమ్మకాయలు, నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వీటిలో ఉండే కొల్లాజిన్ చర్మం సాగే గుణాన్ని, దృఢత్వాన్ని కాపాడుతుంది. నిమ్మరసం చర్మంపై ఉండే మచ్చలను, పిగ్మెంటేషన్‌ను తగ్గించి, కాంతివంతంగా మారడానికి సహాయపడుతుంది.
2. బొప్పాయి:
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మృత కణాలను తొలగించి.. చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. ఇందులో విటమిన్లు A, C, E లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి. అంతే కాకుండా బొప్పాయి చర్మంపై ఉండే మచ్చలను, మొటిమలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
3. దానిమ్మ:
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు (ముఖ్యంగా పునికలాగిన్స్) అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సూర్యరశ్మి, వృద్ధాప్య సంకేతాల నుంచి రక్షిస్తాయి. చర్మ కణాలను పునరుత్పత్తి చేయడానికి కూడా దానిమ్మ సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మానికి ఆరోగ్యకరమైన ఎరుపు రంగును, మెరుపును అందిస్తుంది.
4. అరటిపండ్లు:
అరటిపండ్లు విటమిన్లు A, B, E , పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచి, పొడిబారకుండా కాపాడతాయి. అరటిపండు పేస్ట్ మొటిమలను, ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి చర్మానికి సహజమైన గ్లోను అందిస్తాయి.
5. పుచ్చకాయ:
పుచ్చకాయలో దాదాపు 92% నీరు ఉంటుంది. ఇది చర్మాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడి, తేమగా ఉంచుతుంది. ఇందులో విటమిన్లు A, B6, C , యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అంతే కాకుండా ఇవి చర్మానికి తాజాగా, మెరిసేలా చేస్తాయి. పుచ్చకాయ జ్యూస్ చర్మాన్ని చల్లబరచి, మృదువుగా ఉంచడానికి కూడా తోడ్పడుతుంది.
6. ఆపిల్:
ఆపిల్స్‌లో విటమిన్ A, C, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని శుభ్రపరుస్తాయి. మచ్చలను, మొటిమలను తగ్గిస్తాయి. ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.
Also Read: గుమ్మడికాయ జ్యూస్ తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !
7. అవకాడో:
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ E చర్మ కణాలను దెబ్బతినకుండా రక్షిస్తుంది. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి. అంతే కాకుండా అవకాడో చర్మాన్ని మృదువుగా, సున్నితంగా మార్చి.. సహజమైన గ్లోను ఇస్తుంది. తరచుగా అవకాడో తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా ఇందులోని పోషకాలు ముఖాన్ని నేచురల్‌గానే మెరిసేలా చేస్తాయి.