E-Paper
Advertisement

Karate Kalyani : చూపించేది ఉంటే మీ ఆయనకు చూపించుకోండి..!

Karate Kalyani :  చూపించేది ఉంటే మీ ఆయనకు చూపించుకోండి..!
Advertisement

Karate Kalyani : నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కార్చిచ్చులా రేగుతున్నాయి. ఈ వివాదంపై సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోగా, తాజాగా నటి కరాటే కళ్యాణి ఎంట్రీ ఇచ్చి శివాజీకి అండగా నిలిచారు. ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చకు దారితీస్తున్నాయి. ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లలో ధరించే పొట్టి దుస్తులు చూసి బాధ కలుగుతోందని, స్త్రీ ప్రకృతి లాంటిదని, ఆమె నిండుగా ఉంటేనే గౌరవం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ మాటలపై అనసూయ, చిన్మయి వంటి వారు డ్రెస్సింగ్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ మండిపడ్డారు.

శివాజీకి మద్దతుగా కరాటే కళ్యాణి
ఈ ఇష్యూపై ఒక టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న కరాటే కళ్యాణి, శివాజీ వ్యాఖ్యల్లోని అంతరార్థాన్ని సమర్థించారు. కథ డిమాండ్ చేస్తే సినిమాలో గ్లామర్‌గా కనిపించడం వేరు.. కానీ పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చేటప్పుడు అర్ధనగ్నంగా కనిపించాల్సిన అవసరం ఏముంది? అని ఆమె ప్రశ్నించారు. శివాజీ ఒక అన్నగా, తండ్రిగా ఆందోళన చెంది ఆ మాటలు అన్నారని, ఆయన ఉద్దేశం మంచిదేనని స్పష్టం చేశారు.

Advertisement

అనసూయపై ఘాటు విమర్శలు
ముఖ్యంగా అనసూయ తీరును కళ్యాణి తప్పుబట్టారు. అనసూయ ఇంట్లో ఫంక్షన్లు ఉంటే పద్ధతిగా కనిపిస్తారు.. మరి బయట కార్యక్రమాల్లో ఆ బాధ్యత ఎందుకు ఉండదు? అని అడిగారు. హీరోయిన్ల డ్రెస్సింగ్‌ను చూసి చిన్న పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉందని, సమాజంలో సంస్కృతి పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనా చూపించేది ఉంటే మీ ఆయనకు చూపించుకోండి.. పబ్లిక్‌కి కాదు అంటూ ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

శివాజీ వాడిన పదాలు తప్పుగా ఉన్నా, ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్ అని కళ్యాణి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో అశ్లీలత పెరిగిపోతోందని, అభ్యుదయవాదులు ఇలాంటి విషయాలపై కూడా మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతుండటంతో, దీనిపై అనసూయ ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Advertisement

 

Related News

పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ డోస్.. ఒక్క ఫొటోతో సోషల్ మీడియా షేక్!

సంగీత సామ్రాజ్ఞి కథలో నేషనల్ క్రష్.. రష్మిక కొత్త అవతారం!

జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం

సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ

‘కాంతారా’ బ్యూటీకి అవార్డు.. రుక్మిణీ వసంత్ స్పెషల్ పోస్ట్ వైరల్!

ఎల్లమ్మలో దేవిశ్రీకి జోడీ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టే!

దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×