Alia Bhatt:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఆలియా భట్ (Alia Bhatt) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం ఈమె పీఏ వేదిక ప్రకాష్ శెట్టి (Vedhika Prakash Shetty) ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలియా భట్ వ్యక్తిగత ఖాతాతో పాటు ఆమె నిర్మాణ సంస్థ “ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్” ఖాతాల నుండి సుమారుగా రూ.76,90,892 మేరా మోసం చేసినట్లు అలియా భట్ తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వేదిక ప్రకాష్ శెట్టిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 5 నెలలు గాలించిన తర్వాత బెంగళూరులో అరెస్టు చేయడం జరిగింది.
అలియా భట్ పీఏను అరెస్టు చేసిన పోలీసులు..
అసలు విషయంలోకి వెళ్తే.. 2021లో అలియా భట్ దగ్గర వేదిక ప్రకాష్ శెట్టి పీఏగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు నమ్మకస్తురాలిగా వ్యవహరించి.. నకిలీ బిల్లుల ద్వారా ఆలియా ప్రొడక్షన్ హౌస్ అలాగే వ్యక్తిగత ఖాతా ద్వారా రూ.77 లక్షలు మోసం చేసినట్లు గుర్తించారు. ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్లో వేదిక ప్రకాష్ శెట్టి పై కేసు నమోదు అయింది. దీంతో అరెస్టు చేసిన పోలీసులు బెంగళూరు నుంచి ఐదు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ పై ముంబైకి తీసుకొచ్చారు ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అందులో భాగంగానే మంగళవారం నగర కోర్టు ముందు పోలీసులు ఆమెను హాజరు పరిచారు.లక్షల రూపాయలు మోసం చేసినందుకు ఆలియా భట్ పీఏ ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అలియా భట్ పీఏ అరెస్టుతో బాలీవుడ్ మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఇది లేడీ కాదు ఖిలాడి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
అలియా భట్ నుండీ రాబోయే సినిమాలు..
అలియా భట్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆల్ఫా సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతోంది. ఇందులో ఆలియాతో పాటు నటి శార్వరీ వాగ్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనుంది.
అలియా భట్ సినిమా జీవితం..
అలియా భట్ సినిమా జీవిత విషయానికి వస్తే.. మహేష్ భట్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె హిందీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది. అటు సౌత్ సినిమాలలో కూడా నటించడానికి సిద్ధంగా ఉంటుంది. అందులో భాగంగానే తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటించి.. సీత పాత్రలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఈమెకు తెలుగులో అవకాశాలు తలుపుతట్టే అవకాశం ఉన్నా.. ప్రస్తుతం ఆలియా భట్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆమెను ఇంకా ఎవరు సంప్రదించలేదని సమాచారం.
ALSO READ:Keerthy Suresh: పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న మహానటి.. త్వరలో ఆ పార్టీలో చేరిక!