Chhattisgarh: మద్యం మత్తులో తాగుబోతులు రోడ్లపై వెళ్లినవారిని ఏమైనా చేస్తారనే భయంతో పోలీసులు నిత్యం అటు ఇటు తిరుగుతారు. క్లబ్ నుంచి బయటకు వచ్చిన ఓ మహిళ, పోలీసుపై చిందులేసింది. చాలాసేపు వాగ్వాదానికి దిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అసలేం జరిగింది? లోతుల్లోకి వెళ్దాం.
ఛత్తీస్‌గఢ్ లోని కోర్బా జిల్లాలో ఓ పోలీస్‌స్టేషన్ సమీపంలో వన్ నైట్ క్లబ్ వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది. ఆ క్లబ్ ఇప్పుడు తాగుబోతులకు కేరాఫ్‌గా మారింది. ప్రతీరోజూ రాత్రివేళ యువతీయువకులు మద్యం తాగి బయటకు నానా గొడవలు సృష్టిస్తున్నారు. ఈ వ్యవహారం తెలిసిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేశాయి. అయినా సరే మత్తులో నానా హంగామా చేస్తున్నారు.
సోమవారం రాత్రి రెండు వర్గాలు యువకులు క్లబ్ నుంచి బయటకు రాగానే చిన్నపాటి మాటకు మాట మొదలైంది. తీవ్రరూపం దాల్చి చివరకు ఘర్షణగా మారింది. ఆ సమయంలో ఓ థార్ వాహనానికి డ్యామేజ్ అయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా జరిగిన ప్రాంతానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింప జేయడానికి ప్రయత్నించారు.
అదే సమయంలో కోర్బాలోని వన్ నైట్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన ఓ యువతి నానాహంగమా సృష్టించింది. ఆ సమయంలో పోలీసుపై చిందులేసింది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. క్లబ్ బయటకు వచ్చిన ఓ యువతి పోలీసుతో వాగ్వాదానికి దిగుతూ.. రోడ్డుపై బిగ్గరగా అరుస్తూ కనిపించింది. అంతేకాదు పోలీసులతో వాగ్వాదానికి దిగింది.
ALSO READ: ఆగ్రహంతో ఊగిపోయారు.. చెఫ్‌ను ఉతికేసిన ఎమ్మెల్యే
వారిపై పదే పదే ఆరోపణలు చేయడం ప్రారంభించింది.పైగా పోలీసాయనను బెదిరించే ప్రయత్నం చేసింది. ఆమె ప్రవర్తన కారణంగా పోలీసులేకాదు అక్కడున్న ప్రజలు షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి, ఈ తతంగాన్ని వీడియో చిత్రీకరించిన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తోంది. ఆ అమ్మాయి మత్తులో ఉన్నట్లు అందులో కనిపిస్తోంది. ఈ క్లబ్ వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగడమేకాదు, అక్కడి వాతావరణాన్ని కలుషితం అవుతోందని అంటున్నారు. వెంటనే వన్ నైట్ క్లబ్‌ను మూసి వేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.
❌⛔️सावधान! वीडियो में भारी गाली-गलौज है — Viewers Discretion Advised📛⛔️
🚫📵🎧 कृपया हेडफोन लगाकर या म्यूट करके देखें | Loud verbal abuse in video🔞🚫
💥 Verdant industrial district Korba in Chhattisgarh ERUPTS outside One Night Club!
Drunken chaos, slaps &… pic.twitter.com/zCOAaNm4NZ— Mukesh S Singh (@truth_finder04) July 8, 2025