Heroine Poorna:తన అందంతో అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో పూర్ణ (Poorna) కూడా ఒకరు. రవిబాబు(Ravibabu ) చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె సీమటపాకాయ్, అవును చిత్రాలతో హీరోయిన్ గా పేరు అందుకుంది. మొదట్లో హీరోయిన్ గా నటించిన ఈమె.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అఖండ, దసరా, భీమా వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసిన ఈమె.. మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాలో “కుర్చీ మడత పెట్టి” అనే పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది.
45 రోజుల దూరాన్ని భరించలేకపోయా..
కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2022లో దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త షానిద్ అసిఫ్ అలీ (Shanid Asif Ali) ను పెళ్లి చేసుకుంది. ఆ మరుసటి ఏడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఈమె.. కొడుకు ఆలనా పాలనా చూసుకోవడం కోసం కొంతకాలం ఇండస్ట్రీకి కూడా దూరమయ్యింది.. ఆ తర్వాత కొద్ది రోజులకు రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఏదో ఒక షో, ఈవెంట్ చేస్తూ బిజీగానే గడుపుతోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు సడన్ గా ఈమె కోసం ఈమె భర్త చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఆయన తన పోస్ట్ లో.. “నా జీవితంలో ఈ 45 రోజులను నేనెప్పటికీ మర్చిపోలేను. ఒంటరితనాన్ని, నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను. నీ జ్ఞాపకాలతోనే రాత్రులు కూడా గడపాల్సి వచ్చింది. ప్రతిరోజు ఉదయం నిన్ను తలుచుకొని ఏడ్చేవాడిని. ముఖ్యంగా మనల్ని ప్రేమించే వారు మనతో ఉండడమే జీవితంలో అంతకంటే గొప్ప వరము. ఈ 45 రోజుల్లో నాకు నీ ప్రేమ గొప్పతనం తెలిసి వచ్చింది. ఈరోజు నా భార్య నా దగ్గరకు తిరిగి వచ్చేసింది. ఎన్నో ఎదురు చూపుల తర్వాత నా భార్యను చూసి తట్టుకోలేకపోయాను” అంటూ ఆనందభాష్పాలతో ఒక పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఇది చూసిన చాలామంది ఈ దంపతుల మధ్య ఏం జరిగింది? వీరిద్దరూ కలిసి లేరా? అసలు పూర్ణా 45 రోజుల పాటు తన భర్తకు ఎందుకు దూరంగా ఉంది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
క్లారిటీ ఇచ్చిన పూర్ణ భర్త..
ఇకపోతే ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు మళ్లీ ఆయనే స్పందించారు. పూర్ణ భర్త స్పందిస్తూ.. “నా భార్య 20 రోజులు చెన్నైలో.. మరో 15 రోజులు మలప్పురంలో..మరో 10 రోజులు జైలర్ 2 సినిమా కోసం అక్కడ తన ఇంట్లో ఉంది. మొత్తం 45 రోజులు నాకు దూరంగా ఉంది. పెళ్లి జరిగిన తర్వాత ఎప్పుడు కూడా ఇన్ని రోజులు దూరంగా ఉండలేదు. అందుకే అలా పోస్ట్ పెట్టాను. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. దేవుడి దయతో మేమంతా సంతోషంగానే ఉన్నాము” అంటూ ఆయన వివరణ ఇస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పూర్ణతో కలిసి దిగిన ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు. ఇక ఈయన ప్రేమ చూసి అభిమానులు ముచ్చట పడిపోతున్నారు. భార్యపై ఎంత ప్రేమ ఎప్పటికీ కొనసాగించాలని కోరుకుంటున్నారు.
ALSO READ:Tollywood: పెద్ద సినిమాలో కావాలనే తప్పించారు.. క్యాస్టింగ్ కౌచ్ పై నటి ఆవేదన!