E-Paper
Advertisement

Prathyusha: నటి ప్రత్యూష మృతి… 24 ఏళ్ల నాటి కేసులో తుది తీర్పు నేడే!

Prathyusha: నటి ప్రత్యూష మృతి… 24 ఏళ్ల నాటి కేసులో తుది తీర్పు నేడే!
Advertisement

Prathyusha:దివంగత నటి ప్రత్యూష (Prathyusha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలోని భువనగిరిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఈమె.. తల్లి శ్రీమతి సరోజినీ దేవి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఈమె సోదరుడు ప్రణీత్ చంద్ర. ప్రత్యూష భువనగిరిలోని సంతోష్ విద్యానికేతన్ లో, మిర్యాలగూడలోని ప్రకాష్ పబ్లిక్ స్కూల్లో, హైదరాబాద్లోని తార్నాక లోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ఎస్ఆర్ నగర్ లోని గౌతమి రెసిడెన్షియల్ అకాడమీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఈమె.. బంజారాహిల్స్ అలాగే జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

మోహన్ బాబు సినిమా తోనే మంచి గుర్తింపు..

టెలివిజన్ స్టార్ 2000లో పాల్గొని శ్రీమతి లవ్లీ స్మైల్ కిరీటాన్ని గెలుచుకుంది. ఇక ఈ పోటీలో విజయం అందుకోవడంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి మార్గం సుగమం అయింది. కానీ అప్పటికే తొలిసారి 1998లో రాముడు అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ ప్రముఖ రాజకీయవేత్త పరిటాల రవీంద్ర తండ్రి పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన శ్రీరాములయ్య సినిమాలో మోహన్ బాబు కూతురు పాత్రలో నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది..

24 ఏళ్ల నాటి మృతి కేసు.. నేడే తుది తీర్పు..

Advertisement

ఇక తర్వాత స్నేహం అంటే ఇదేరా, కలుసుకోవాలని వంటి చిత్రాలలో నటించిన ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే 2002 ఫిబ్రవరి 23న తన బాయ్ ఫ్రెండు సిద్ధార్థ రెడ్డి తో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నంలో ప్రత్యూష హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. సిద్ధార్థ రెడ్డి కోలుకున్నారు. అయితే సిద్ధార్థ రెడ్డి వల్లే తన కూతురు మరణించింది అని ఆరోపిస్తూ ప్రత్యూష తల్లి సరోజిని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా.. ఆయనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు అరెస్టు చేశారు. అలా 24 సంవత్సరాలుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. అయితే సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు ఇవ్వనుంది. గత ఏడాది నవంబర్లో సిద్ధార్థ రెడ్డి తనపై వేసిన జైలు శిక్షణను సవాల్ చేస్తూ అప్పీల్ చేయగా.. అతడి శిక్షణ పెంచాలి అంటూ ప్రత్యూష తల్లి సరోజినీ వేసిన పిటిషన్ల పై గత ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే 24 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది..

ALSO READ:Film industry: ఇండస్ట్రీలో విషాదం.. గాడ్ ఫాదర్ మూవీ నటుడు మృతి!

న్యాయం కావాలంటున్న ప్రత్యూష తల్లి!

Advertisement

ఇకపోతే ప్రత్యక్ష తల్లి సరోజినీ ఆవేదన వ్యక్తం చేస్తూ.. తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, కావాలనే కొంతమంది అఘాయిత్యానికి పాల్పడి నరకయాతన చూపించి, ఘోరంగా హింసించారని, దాంతో తన కుమార్తె చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని, ఆ దేవుడే శిక్ష విధిస్తాడని చెప్పుకొచ్చింది. సుప్రీంకోర్టు సిద్ధార్థ రెడ్డిని వదిలిపెట్టకూడదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి కోర్టు తీర్పు ఏ విధంగా ఇవ్వనందో చూడాలి.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×