Test Twenty: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్ . క్రికెట్ లో సరికొత్త ఫార్మాట్ రాబోతోంది. టెస్టు 20 ఫార్మాట్ పేరుతో ఈ టోర్నమెంట్ జరగనుంది. టెస్టు అలాగే టీ20 ల కలయికతో టెస్ట్ 20 అనే సరికొత్త క్రికెట్ ను తీసుకురాబోతున్నారు. ఇందులో రెండు జట్లు 20 ఓవర్ల చొప్పున ఒకేరోజు రెండు ఇన్నింగ్స్ లు ఆడతాయన్నమాట. టెస్ట్ మ్యాచ్ లాగా రెండు సార్లు బ్యాటింగ్ చేయవచ్చు. అంటే ఒకే రోజున 80 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. 2026 జనవరిలో జూనియర్ టెస్ట్ 20 ఛాంపియన్షిప్ తొలి సీజన్ నిర్వహించబోతున్నట్లు ఈ ఫార్మాట్ కు సంబంధించిన ఫౌండర్ గౌరవ్ బహిర్వాణి పేర్కొన్నారు. దీనికి మాజీ ప్లేయర్స్ ఏపీ డివిలియర్స్, మ్యాచ్ హెడెన్ అలాగే హర్భజన్ సింగ్ అటు క్లైవ్ లాయిడ్ సలహాదారులుగా ఉంటారు. ఇక ఈ ఫార్మాట్ పై ప్రకటన రావడంతో.. క్రికెట్ అభిమానులు సంబరపడిపోతున్నారు.
క్రికెట్ ప్రపంచంలోకి సరికొత్త ఫార్మాట్ వస్తోంది. టెస్ట్ 20 పేరుతో ఈ లీగ్ ప్రారంభం కాబోతోంది. దీని ప్రకారం ఒకే రోజున 80 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. అంటే ఒక్క టీం 40 ఓవర్ల చొప్పున ఆడుతుంది. మొదటి ఇన్నింగ్స్ లో 20 ఓవర్లు ఆ తర్వాత మరో 20 ఓవర్లు ఆడుతుంది. ఇక అనంతరం ప్రత్యర్థి జట్టు కూడా 20 ఓవర్ల చొప్పున రెండుసార్లు బ్యాటింగ్ చేస్తుంది. అలా మొత్తంగా ఒకే రోజు ఈ 80 ఓవర్స్ పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
అచ్చం టెస్ట్ తరహా లోనే, టి20 మ్యాచ్ అన్నమాట. రోజు రోజుకు కాలం మారుతోంది. ఆ మారిన కాలానికి తగ్గట్టుగానే, మనం కూడా మారాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే క్రికెట్ లో కూడా సరికొత్త మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే టెస్ట్ టీ20 సిరీస్ తెరపైకి తీసుకువస్తున్నారు. అయితే ఈ కొత్త టోర్నమెంటులో ఏ బి డివిలియర్స్ అలాగే హర్భజన్ సింగ్ అటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మ్యాత్యు హెడేన్ ఉండడం గమనార్హం. వీళ్లు అడ్వైజరీ బోర్డు కింద సభ్యులుగా ఉంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటుకు ( Indian Premier League Tournament ) ఉన్న ప్రాధాన్యత అంతా కాదు. ప్రపంచంలోనే ఈ టోర్నమెంట్ కు అత్యంత ప్రేక్షక ఆదరణ ఉంది. వరల్డ్ కప్ కంటే ఎక్కువగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League Tournament ) తిలకిస్తారు. దాదాపు 18 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న టోర్నమెంట్ ఇది. అయితే ఈ టోర్నమెంట్ సక్సెస్ అయిన తర్వాత మన క్రికెట్ చరిత్ర లోకి అనేక రకాల టోర్నమెంట్లు వచ్చాయి. కొన్ని టెన్ ఓవర్స్ మ్యాచ్ లు రాగా.. మరికొన్ని ఇతర లీగులు కూడా వచ్చాయి. ఏవి వచ్చినా కూడా ఐపీఎల్ లు మాత్రం బీట్ చేయలేకపోయాయి.
🚨 TEST TWENTY IS HERE 🚨
A brand-new format reimagining world cricket! 🏏
2 innings, 1 day, 80 overs — the perfect mix of Test class & T20 thrill ⚡Backed by legends AB de Villiers, Clive Lloyd, Hayden & Harbhajan 🔥#TestTwenty #CricketRevolution #ABdeVilliers #Hayden… pic.twitter.com/3sBAYQhtbX
— Video Memes (@MemesChennai) October 16, 2025