E-Paper
Advertisement

దుర్గమ్మ సన్నిధిలో రంభ..రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నటి!

దుర్గమ్మ సన్నిధిలో రంభ..రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నటి!
Advertisement

Actress Rambha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రంభ ఒకానొక సమయంలో అగ్ర హీరోలందరి సరసన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత రంభ అందరిలాగే ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత పిల్లల బాధ్యతలతో ఇండస్ట్రీకి దూరమైన ఈమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రంభ ఇండస్ట్రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. ఈమె తాజాగ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఇలా అమ్మవారి దర్శనం తర్వాత రంభ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం గురించి మాట్లాడారు.

దుర్గమ్మను దర్శించుకున్న రంభ

ఇటీవలే దుర్గమ్మను దర్శించుకున్నానని అయితే మరి ఇంత తొందరగా నాకు అమ్మవారి దర్శనం కలుగుతుందని అనుకోలేదు అంటూ ఈమె అమ్మవారి దర్శనం గురించి తెలియజేశారు. నేను చిన్నప్పటినుంచి విజయవాడలోనే పుట్టి పెరిగానని తరచూ అమ్మవారి దర్శనం చేసుకుంటానని తెలిపారు. సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటూ ప్రశ్న ఎదురవడంతో ఈమె స్పందిస్తూ ప్రస్తుతానికైతే తాను ఎలాంటి సినిమాలు చేయాలనుకోవడం లేదని తెలిపారు. కొన్ని కథలను విన్నానని అయితే అవి నాకు నచ్చలేదని తెలిపారు.

మంచి పాత్రలు వస్తే నటిస్తా..

Advertisement

నాకు అనుగుణంగా ఉండే పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను అయితే ప్రస్తుతానికి తాను ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని ఈ సందర్భంగా రంభ క్లారిటీ ఇచ్చారు. ఇక రంభతో పాటు హీరోయిన్లుగా ఇండస్ట్రీలో పనిచేసిన వారందరూ ఇప్పటికే తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రంభ కుడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు రావడంతో ఈ వార్తలపై రంభ స్పష్టత ఇచ్చారు. ఇక రంభ కెరియర్ విషయానికి వస్తే ఈమె 1991 వ సంవత్సరంలో సర్గం అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

స్పెషల్ సాంగ్స్ లో రంభ..

Advertisement

ఇలా మలయాళ సినిమా ద్వారా అవకాశం అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా అనంతరం తెలుగులో ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనంతరం ఈమె అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా, భైరవద్వీపం, బొంబాయి ప్రియుడు వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇక ఈమె హీరోయిన్గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేశారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు, ఎన్టీఆర్ యమదొంగ, నాగ వంటి సినిమాలో స్పెషల్ సాంగ్స్ ద్వారా అందరిని ఆకట్టుకున్నారు. ఈమె హీరోయిన్గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అంటూ దాదాపు 8 భాషలలో 100కు పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన రంభ సరైన కథ దొరికితే రీ ఎంట్రీ ఇస్తానని చెప్పడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: సడెన్ గా మరో ఓటీటీలోకి వచ్చిన గుణశేఖర్ యుపోరియా ..ఎక్కడ చూడొచ్చంటే!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×