E-Paper
Advertisement

నిశ్చితార్థం చేసుకున్న తేజ సజ్జ.. గవర్నర్ స్పెషల్ విషెస్

నిశ్చితార్థం చేసుకున్న తేజ సజ్జ.. గవర్నర్ స్పెషల్ విషెస్
Advertisement

Teja Sajja:ప్రముఖ యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) ఎట్టకేలకు ఒక ఇంటి వారు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో చాలా ఘనంగా జరిగింది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అమ్మాయితో తేజా సజ్జ నిశ్చితార్థం జరిగింది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని తేజ గతంలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు.

తేజా సజ్జా నిశ్చితార్థ వేడుకల్లో తెలంగాణ గవర్నర్..

తేజ సజ్జ నిశ్చితార్థ వేడుకల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు ఈ నేపథ్యంలోనే ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా హాజరయ్యి.. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈయనతో పాటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , బిఆర్ఎస్ నేత హరీష్ రావుతో పాటు సినీ నటులు రవితేజ , నాని, శ్రీకాంత్ ,రానా, హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు డైరెక్టర్లు ప్రశాంత్ వర్మ, అనిల్ రావిపూడి , రాఘవేంద్రరావు సహ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు , సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఆకట్టుకుంటున్న తేజా సజ్జా దంపతులు..

Advertisement

ఇకపోతే తాజాగా గవర్నర్ తేజా సజ్జ కాబోయే నూతన దంపతులకు విషెస్ తెలియజేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఇందులో తేజ కాబోయే భార్యను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. పర్ఫెక్ట్ మ్యాచింగ్ అంటూ ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికైతే తేజకు పర్ఫెక్ట్ అమ్మాయి దొరికింది.. ఈడు జోడు చాలా అద్భుతంగా ఉంది.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా తేజా సజ్జ తన నిశ్చితార్థ వేడుకలతో మరోసారి వార్తల్లో నిలిచారు అని చెప్పవచ్చు.

also read:చెల్లి పెళ్లిలో సందడి చేస్తున్న హీరోయిన్ నజ్రియా!

తేజా సజ్జా మూవీ కెరియర్..

Advertisement

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ.. పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తేజ.. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా అవతరించారు. మరోవైపు మిరాయ్ చిత్రంతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ప్రస్తుతం వరుస ప్రాజెక్టు చేస్తూ ప్రేక్షకులను అనుభవిస్తున్నారు.

Related News

ఇది ఆరంభం మాత్రమే..ఇంకా చాల ఉంది.. 15 ఏళ్ల కెరీర్ పై అనిరుద్ పోస్ట్!

జరిగిందే చెప్పాను.. ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు..  వైజాగ్ ఘటన పై నటి ఆవేదన!

చెల్లి పెళ్లిలో సందడి చేస్తున్న హీరోయిన్ నజ్రియా!

ఘనంగా తేజ సజ్జ నిశ్చితార్థం..హాజరవుతున్న సినీ, రాజకీయ ప్రముఖులు!

‘రామాయణ’ చూసి ఫిదా అయిన అమల అక్కినేని.. ఏమన్నారంటే?

ఆసక్తి రేపుతున్న ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ రిలీజ్!

శ్రీహరి ఇంట్లో శుభకార్యం.. పెళ్లి పీటలెక్కబోతున్న పెద్ద కొడుకు?

Big Stories

Advertisement
×