E-Paper
Advertisement

హీరోయిన్ రితికా నాయక్ రియల్ లైఫ్ లో కష్టాలు .. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

హీరోయిన్ రితికా నాయక్ రియల్ లైఫ్ లో కష్టాలు .. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..
Advertisement

Rithika Nayak : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రితిక నాయక్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. విశ్వక్ సేన్ నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీతో ఇండస్ట్రీకి పరిచయమేనా ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వచ్చినా ఈమె ప్రస్తుతం స్టార్ హీరోల సర్చనా జోడి కడుతుంది. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్న ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆ వీడియో ప్రస్తుతం నెట్ ఇంత చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆమె ఏం చెప్పింది అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

మధ్యతరగతిలో ఎన్నో కష్టాలు.. 

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రితిక తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా ఆమె తన ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట పెట్టింది. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న జాబ్ చేస్తూ మమ్మల్ని పోషించాడు అని చెప్పింది. అప్పట్లో ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించి అందరిని కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని పంచుకుంది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రితిక నాయక్ ఫ్యామిలీ గురించి బయట పెట్టడంతో చాలామంది అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఏ హీరోయిన్ కైనా కూడా ఇలాంటి బ్యాగ్రౌండ్ ఉండనే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు జీవితంలో సక్సెస్ అవుతారని మరోసారి ఈ అమ్మడు నిరూపించింది.

రితికా నాయక్ సినిమాల విషయానికొస్తే.. 

Advertisement

టాలీవుడ్ హీరోయిన్ రితికా నాయక్ ఢిల్లీ లోని ఒడిశా కుటుంబంలో జన్మించింది. ఆ తర్వాత అక్కడే తన చదువును పూర్తి చేసింది. మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత ఆమె అందానికి ఫిదా అయిన సినీ ప్రముఖులు సినిమా అవకాశాలు ఇచ్చారాని తెలుస్తుంది. ఈమె టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీలో నటించింది. ఆ మూవీ ఆమెకు మంచి క్రేజ్ ను అందించింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత హాయ్ నాన్న, మిరాయ్ సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు మంచి టాక్ ను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

Related News

అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

జానీ మాస్టర్ అవుట్.. సందీప్ ఇన్!

అక్క మరణంపై మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్!

కాబోయే భర్తను పరిచయం చేసిన ‘గద్దల కొండ గణేష్’ మూవీ హీరోయిన్!

కూతుళ్లు చెప్పినా వినకుండా రూ.26 కోట్లు నష్టపోయిన నిర్మాత?

డ్యాన్సర్ అసోసియేషన్లో మళ్లీ వివాదం.. సుమలత తీరుపై ఫెడరేషన్ మండిపాటు!

పెళ్లి బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగించిన పూజా హెగ్డే.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×