Dil Raju on Ramayana Review: నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సాయి పల్లవి(Sai Pallavi) హీరో హీరోయిన్గా నటించిన తాజా చిత్రం రామాయణ(Ramayana). ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. రామాయణ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా జరిగాయి. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా మరికొన్ని గంటలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఈ సినిమాపై తన రివ్యూ తెలియజేశారు.
రామాయణ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులను దిల్ రాజు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామాయణ సినిమా చూసిన దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక ఈయన చేసిన పోస్టులో భాగంగా రామాయణ ఇతిహాసాన్ని సినిమాగా మన తెలుగు ప్రేక్షకులకు అందించే భాగ్యం మాకు కలగడం ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నానని తెలిపారు. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ సీతాదేవిగా సాయి పల్లవి అద్భుతంగా నటించారని తెలిపారు. రావణాసురుడి పాత్రలో నటించిన యష్(Yash) నటన తనని అబ్బురపరిచింది అంటూ యష్ పాత్ర పై ప్రశంసలు కురిపించారు.
రామాయణ సినిమా అద్భుతమైన చిత్రీకరణ, ఏఆర్ రెహమాన్ అలాగే హాన్స్ జిమ్మర్ అందించిన సంగీతం మనసుకు హత్తుకునే కథనం. ప్రేక్షకులకు మరుపురాని అనుభూతిని అందించబోతుంది. మనదైన ఈ చిరస్మరణీయ పురాణ కావ్యాన్ని ఇంతటి స్థాయిలో తెరకెక్కించిన నమిత్ జీ, నితీష్ జీ కి మా హృదయపూర్వక అభినందనలు అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దిల్ రాజు రామాయణ సినిమాకు తన రివ్యూ ఇవ్వటంతో సినిమా పట్ల కూడా మంచి అంచనాలు పెరిగిపోయాయి.
#Ramayana is an emotion that unites generations and a story that defines our roots and one we have grown up with.
And there couldn’t be a better way to cherish this timeless epic than experiencing it on the big screens from Tomorrow. ❤️
AP & TG by @SVCRelease #RamayanaOnNov5th pic.twitter.com/WHrdZ1swnt
— Sri Venkateswara Creations (@SVC_official) November 4, 2026
ఇప్పటికే ఇండస్ట్రీలో రామాయణం కథ ఆధారంగా ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి తాజాగా రామాయణ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది అయితే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి భాగం నవంబర్ 5 న విడుదల కాగా రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. ఇలా ఈ సినిమా రెండు భాగాలు కలిపి ఏకంగా ₹4,000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్టు చిత్ర నిర్మాతలు తెలియజేశారు. మరి భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సింది.
Also Read: ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ రిలీజ్..మూగవాడిగా అనీష్ మెప్పించేనా?