Nagavamsi : టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన వారిలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత నాగ వంశీ (Nagavamsi) ఒకరు. నాకు వంశీ నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇకపోతే ఇటీవల కాలంలో నాగ వంశీ పెద్ద ఎత్తున ఇతర భాష సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువగా తమిళ సినిమాలపై నాగ వంశీ ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ 2(Jailer 2) సినిమా తెలుగు రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో నాగ వంశీ భారీ స్థాయిలో లాభాలను అందుకున్నారు. అయితే తాజాగా మరో సినిమా తెలుగు రిలీజ్ హక్కులను కూడా నాగవంశీ కైవసం చేసుకున్నారు.ధనుష్ (Danush)– మమ్ముట్టి క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఓం: చాప్టర్ 2’(Om Chapter 1). ‘రుధిరం: ది బ్లడ్ వుడ్’ అనే ట్యాగ్ లైన్ తో కాబోతున్న ఈ సినిమా నవంబర్ 20వ తేదీ విడుదల కాబోతోంది.రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి శ్రీలీల, నజీరుద్దీన్ షా, ఇంద్రన్స్, చైతు జొన్నలగడ్డ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఎన్నో అంచనాలు నడుమ నవంబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగు హక్కులను నాగ వంశీ కైవసం చేసుకున్నారు. ఇలా జైలర్ 2 తో హ్యాట్రిక్ కొట్టిన నాగ వంశీ మరో తమిళ సినిమా రిలీజ్ హక్కులను కైవసం చేసుకోవడంతో సోషల్ మీడియా వేదికగా విభిన్నమైన కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే నాగవంశీ నిర్మాణంలో ధనుష్ హీరోగా సార్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే .ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
Stirring up the #OM storm in the Telugu states! 🔥
Releasing in Andhra Pradesh & Telangana through @SitharaEnts 💥
November 20 in theatres near you!❤️🔥
A @Rajkumar_KP Film.@dhanushkraja @mammukka @Sai_Pallavi92 @SaiAbhyankkar #NaseeruddinShah @sreeleela14 #Indrans… pic.twitter.com/Cf8yvnjPNp
— Sithara Entertainments (@SitharaEnts) November 4, 2026
ఇకపోతే ఇటీవల జైలర్ 2 సినిమా హక్కులను కైవసం చేసుకున్న నాగవంశీ ఈ డబ్బింగ్ సినిమాకు ఏకంగా ఏపీలో టికెట్ రేట్లను పెంచుతూ విడుదల చేయడంతో పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ఇలా జైలర్ 2 టికెట్లు రేట్లు పెంచుకున్న నాగ వంశీ ఇప్పుడు ధనుష్ ఓం సినిమాకి కూడా యధావిధిగా టికెట్ల రేట్లు పెంచడానికి అనుమతి తీసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తారా లేదంటే సాధారణ టికెట్ ధరలతోనే విడుదల చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: రామాయణ సినిమాకు దిల్ రాజు రివ్యూ.. ఆ పాత్ర పై ప్రశంసలు!