Radhika Apte:సినిమాలలో అవకాశాలు వస్తే బాగున్ను అని కోరుకోవడం, తీరా చేసి డబ్బులు దండుకొని , ఆ తర్వాత అదే సినిమాపై బురద చల్లడం ఇపుడు కామన్ అయిపొయింది.ఇదిగో మొన్నటిదాకా తాప్సి పొన్ను,తమన్నా లు తెలుగు సినిమాలపై ఎలా విషం చిమ్మారో ఇపుడు అదే బాటలో నేనూ అంటుంది బాలీవుడ్ భామ రాధిక ఆప్టే .
విషయంలోకి వెళ్తే కీర్తి సురేష్ అక్కా అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేయగా ఇదే సిరీస్ లో రాధిక ఆప్టే బోల్డ్ పాత్రలో దర్శనమిచ్చింది.ఇక తాజాగా ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండటంతో ప్రమోషన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ ,రాధిక ఆప్టే పాల్గొన్నారు.
అయితే ఇందులో రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట వైరల్ అయిపోయాయి. తాను చేసిన ఒక సినిమాలో తన కంటే పెద్దవాడైన మామయ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని,అసలు అలా చేసుకుంటారో తనకేమాత్రం అర్థం కాలేదని వాపోయింది. అయితే ఆ సినిమా లెజెండ్ అని తెలుగు ప్రేక్షకులు ఎవరైనా ఇట్టే పసిగట్టేస్తారు. దీంతో ఇపుడు రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ పై మండిపడుతున్నారు తెలుగు మూవీ లవర్స్.
సినిమా జరిగే సమయంలో ఎంతైనా డిస్కషన్ చేసుకోవచ్చని,అసలు ఆ పాత్ర నచ్చకపోతే నచ్చలేదని చెప్పి బయటికి కూడా వెళ్లిపోవచ్చని ,కాని డబ్బుల కోసం సినిమా చేసి ,ఇపుడు ఆ సినిమాని అలా ఎగతాళిగా మాట్లాడటం ఏ మాత్రం సంస్కారం కాదని ఏకి పారేస్తున్నారు.నటించేటప్పుడు ఒకలా, తీరా సినిమా అయిపొయి డబ్బులు చేతిలో పడ్డాక మరోలా మాట్లాడటం మీకే చెల్లింది అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజన్లు.
మొన్నటికి మొన్న పెద్దిలో అందాలు ఒలకబోసి ,తర్వాత అబ్బే అలా చేయాల్సింది కాదంటూ తెప్ప తగలేసిన జాన్వీ, ఝుమ్మంది నాదం సినిమాలో రాఘవేంద్రరావు బొడ్డుపై కొబ్బరి కాయ వేశాడని ,అసలు అలా ఎలా వేస్తారు అంటూ మీడియా ముందు విషం కక్కిన తాప్సి బాటలోనే ఇపుడు రాధిక ఆప్టే నడిచినట్టే కనిపిస్తుంది.సినిమా సమయంలో అంతా ఒకే అంటూ చేసేసి ,పారితోషికం పుచ్చుకుని తీరా ఆ సినిమా పట్ల ఇలా బాధ్యత లేకుండా వాగడం ఎంత వరకు కరక్ట్ అన్నది నెటిజన్ల వాదన.
పోనీ ఈ తారలు అన్ని సినిమాల్లో పద్దతిగా కనిపించారా అంటే వాళ్ళ ఫిల్మోగ్రఫీ ,అందులో చేసిన సినిమాలే చెబుతాయి.అంతకు మించిన అందాల ఒలకబోత ఎలా చేశారో.ఇక రీసెంట్ గా లస్ట్ స్టోరీస్ 3 లో ఇపుడు వాయిస్ రైజ్ చేస్తున్న రాధిక ఆప్టే అయితే గ్లామర్ బార్డర్స్ ఎలా క్రాస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అలాంటి ఈ సుందరాంగులు ఇపుడు చేసిన సినిమాలని ఆ సమయంలో ప్రశ్నించకుండా ఇపుడు నేషనల్ మీడియా ముందు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నారు.బాలీవుడ్ లో అంతకు మించి హద్దులు మీరినా తప్పు లేదు కాని ఇలా తెలుగుకి వచ్చేసరికే ఈ డ్యూయల్ రోల్ ఏంటో అర్థం కాదు అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు టాలీవుడ్ జనాలు.
చూడాలి రాధిక పెట్టిన ఈ మంటలు ఎంతవరకు వ్యాపిస్తాయో !
ALSO READ :‘దారిపొంటొతుండు’తో సెన్సేషన్..మామిడి మౌనిక పాటకు రూ.లక్షల్లో పారితోషికమా?